Skanda 11 Days Collections: సండే రామ్ ఊచకోత.. భారీగా పెరిగిన వసూళ్లు.. స్కంద హిట్ అవ్వాలంటే మాత్రం!
సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. చిన్న వయసులోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ మధ్యనే ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన అతడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని రామ్ 'స్కంద' అనే మూవీతో వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. మధ్యలో డౌన్ అయినా వీకెండ్‌లో మళ్లీ వసూళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 'స్కంద' 11 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
ఊరమాస్ స్టోరీతో వచ్చింది:రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన ఊరమాస్ మూవీనే 'స్కంద'. ఈ మాస్ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్:రామ్ పోతినేని నటించిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా దీనికి తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ జరుపుకుంది.
11వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా:11వ రోజు 'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 1.10 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

11 రోజులకూ కలిపి ఎంత?:ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో 'స్కంద'కి డీసెంట్ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.58 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, గుంటూరులో రూ. 2.68 కోట్లు, కృష్ణాలో రూ. 1.61 కోట్లు, నెల్లూరులో రూ. 1.21 కోట్లతో కలిపి.. రూ. 27.87 కోట్లు షేర్, రూ. 46.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 27.87 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 32.00 కోట్లు షేర్, రూ. 55.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 32.00 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 15.00 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











