Skanda 1st Week Collections: 47 కోట్ల సినిమా.. వారంలో ఏకంగా అన్ని కోట్లు.. హిట్ అవ్వాలంటే మాత్రం!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో రేంజ్‌ను పెంచుకుంటూ వస్తోన్న అతడు.. ఈ మధ్య వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే రామ్ 'స్కంద' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. వసూళ్లు భారీగానే వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో మాత్రం నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో 'స్కంద' 7 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
ఊరమాస్ అవతార్‌లో రామ్:రామ్ పోతినేని హీరోగా చేసిన ఊరమాస్ మూవీనే 'స్కంద'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్:రామ్ కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా దీనికి తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ అయింది.
7వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా:7వ రోజు 'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 74 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజులకూ కలిపి ఎంత?:ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి 7 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 9.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, గుంటూరులో రూ. 2.37 కోట్లు, కృష్ణాలో రూ. 1.31 కోట్లు, నెల్లూరులో రూ. 1.05 కోట్లతో కలిపి.. రూ. 24.33 కోట్లు షేర్, రూ. 40.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 24.33 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.81 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 28.59 కోట్లు షేర్, రూ. 49.40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 28.59 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 18.41 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అదే జరిగితే నష్టాలు ఖాయం:ఉస్తాద్ రామ్ పోతినేని - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన 'స్కంద' మూవీకి ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. అయితే, ఆ తర్వాత నుంచే ఈ చిత్రం అనుకున్న విధంగా రాణించలేకపోతోంది. దీంతో కలెక్షన్లు డల్ అయిపోయాయి. ఇంకా ఈ చిత్రం రూ. 18.41 కోట్లు రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో స్పీడ్ పెరగకపోతే నష్టాలపాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.


Click it and Unblock the Notifications











