Skanda 2 Days Collections: 2వ రోజే షాకింగ్‌గా.. అన్ని కోట్లు వచ్చాయి కానీ.. ఆ దేశంలో రామ్ మరో ఘనత
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ఉస్తాద్ రామ్ పోతినేని. ఆరంభం నుంచీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ మూవీలతో వస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు 'స్కంద' అనే మూవీని చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ భారీగా లభించాయి. అయితే, రెండో రోజు బాగా డౌన్ అయింది. మరి 'స్కంద' 2 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూడండి!

స్కందగా మారిన హీరో రామ్: రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా సినిమానే 'స్కంద'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్: రామ్ నటించిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ అయింది.

2వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు రెస్పాన్స్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 1.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 3.50 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంత?: ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి రెండు రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 58 లక్షలు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలతో కలిపి.. రూ. 12.12 కోట్లు షేర్, రూ. 19.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 12.12 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.57 కోట్లు షేర్, రూ. 24.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: పవర్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో దీనికి రూ. 14.57 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 32.43 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఇంకా రావాలి.. 200 మార్కు: రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'స్కంద' మూవీకి రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 4 కోట్లు వరకూ షేర్ వచ్చింది. కానీ, పెద్ద టార్గెట్ ఉండడంతో ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇక, ఈ చిత్రం ఓవర్సీస్‌లో 200K మార్కును చేరుకుంది. తద్వారా బోయపాటి కెరీర్‌లో వేగంగా ఈ మార్కును చేరుకున్న చిత్రాల లిస్టులో చేరింది.


Click it and Unblock the Notifications











