Skanda 3 Days Collections: శనివారం ఊహించని విధంగా.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. హిట్ అవ్వాలంటే మాత్రం!
రామ్ పోతినేని.. ఈ పేరుతో తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ కుర్రాడు చాలా కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా ఆ మధ్య వరుసగా హిట్లు కొట్టిన ఈ కుర్రాడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 'స్కంద' అనే మూవీని చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ భారీగా లభించాయి. రెండో రోజు బాగా డౌన్ అయినా మూడో రోజు కాస్త పెరిగింది. మరి 'స్కంద' 3 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

స్కందతో వచ్చేసిన ఉస్తాద్: రామ్ పోతినేని హీరోగా చేసిన మాస్ యాక్షన్ మూవీనే 'స్కంద'. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్: ఉస్తాద్ రామ్ 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ జరిగింది.

3వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 1.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 3.27 కోట్లు షేర్, రూ. 5.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
3 రోజులకూ కలిపి ఎంత?: మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, గుంటూరులో రూ. 1.56 కోట్లు, కృష్ణాలో రూ. 75 లక్షలు, నెల్లూరులో రూ. 72 లక్షలతో కలిపి.. రూ. 15.39 కోట్లు షేర్, రూ. 24.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 15.39 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.44 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.38 కోట్లు షేర్, రూ. 31.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ యాక్షన్ స్టోరీతో వచ్చిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 18.38 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 28.62 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అక్కడ 250 కొట్టిన స్కంద: రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన 'స్కంద' మూవీ ఓవర్సీస్‌లో 250K మార్కును చేరుకుంది. తద్వారా బోయపాటి కెరీర్‌లో వేగంగా ఈ మార్కును చేరుకున్న చిత్రాల లిస్టులో చేరింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం క్రమంగా డౌన్ అవుతుంది. మరి ఆదివారం హాలీడే అడ్వాంటేజ్ తీసుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











