Skanda 4 Days Collections: సండే మాస్ కొట్టుడు.. చరణ్ రికార్డు బద్దలు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే!

ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న హీరో రామ్ పోతినేని. చిన్న వయసులోనే ఎన్నో హిట్లతో విశేషమైన గుర్తింపును, మార్కెట్‌ను ఏర్పరచుకున్న అతడు.. ఈ మధ్యన వైవిధ్యమైన చిత్రాలతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'స్కంద' అనే మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ భారీగా లభించాయి. తర్వాత అంతగా రాణించడం లేదు. మరి 'స్కంద' 4 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

స్కందతో ఎంటరైన రామ్:రామ్ పోతినేని హీరోగా.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమానే 'స్కంద'. ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రలను చేశారు.

Ram Pothineni Starrer Skanda Movie 4 Days Worldwide Collections

స్కంద మూవీ ప్రీ బిజినెస్:రామ్ నటించిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ అయింది.

4వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజు రెస్పాన్స్ భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 1.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి.. రూ. 4.46 కోట్లు షేర్, రూ. 7.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ram Pothineni Starrer Skanda Movie 4 Days Worldwide Collections

4 రోజులకూ కలిపి ఎంత?:నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 8.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 96 లక్షలు, గుంటూరులో రూ. 1.97 కోట్లు, కృష్ణాలో రూ. 1.04 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి.. రూ. 19.85 కోట్లు షేర్, రూ. 32.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ram Pothineni Starrer Skanda Movie 4 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 19.85 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.01 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.54 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.40 కోట్లు షేర్‌, రూ. 39.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Ram Pothineni Starrer Skanda Movie 4 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మాస్ కాంబోలో రూపొందిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజుల్లో దీనికి రూ. 23.40 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 23.60 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ram Pothineni Starrer Skanda Movie 4 Days Worldwide Collections

రామ్ చరణ్ రికార్డు బద్దలు:ఉస్తాద్ రామ్ పోతినేని - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన 'స్కంద' మూవీ ఓవర్సీస్‌లో 300K డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా బోయపాటి శ్రీను సినిమాల్లో ఒకటైన 'వినయ విధేయ రామ' ఫుల్ వసూళ్లను అక్కడ దాటేసింది. ఇక, ఇది 310K డాలర్లను వసూలు చేస్తే 'దమ్ము' రికార్డును కూడా బీట్ చేసేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X