Skanda 6 Days Collections: రామ్ స్కంద ఢమాల్.. 6 రోజుల్లో అన్ని కోట్లు.. డిజాస్టర్ కాకూడదంటే మాత్రం!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఎనర్జిటిక్ ఇమేజ్‌తో తనదైన రీతిలో దూసుకుపోతోన్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. ఆరంభంలోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత పంథాను మార్చుకుని వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మాస్ హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలా గత వారమే 'స్కంద' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. వసూళ్లు భారీగానే వచ్చాయి. కానీ, వీకెండ్ తర్వాత ఇది తేలిపోయింది. ఈ నేపథ్యంలో 'స్కంద' 6 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
స్కందగా వచ్చేసిన ఉస్తాద్:రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రమే 'స్కంద'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్:ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో 6వ రోజు రెస్పాన్స్ భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 33 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 1.02 కోట్లు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకూ కలిపి ఎంత?:6 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 9.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, గుంటూరులో రూ. 2.30 కోట్లు, కృష్ణాలో రూ. 1.27 కోట్లు, నెల్లూరులో రూ. 1.03 కోట్లతో కలిపి.. రూ. 23.59 కోట్లు షేర్, రూ. 38.95 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 23.59 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.38 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.72 కోట్లు షేర్, రూ. 47.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లో దీనికి రూ. 27.72 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 19.28 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఇది ఏమాత్రం చాలదుగా:ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన 'స్కంద' మూవీకి ఆరో రోజే వసూళ్లు భారీ స్థాయిలో పడిపోయాయి. ఫలితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1.24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రాబట్టాల్సిన మొత్తం చాలా ఉన్న నేపథ్యంలో ఇది ఇంకాస్త రేంజ్ పెంచుకోవాల్సి ఉంది. లేకుండా డిజాస్టర్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











