Skanda 8 Days Collections: రామ్‌కు బిగ్ షాక్.. 8 రోజుల్లో అన్ని కోట్లు.. అదే జరిగితే కోట్ల నష్టాలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. మంచి బ్యాగ్రౌండ్‌తోనే వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.
ఇలా ఇప్పుడు 'స్కంద' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ, వర్కింగ్ డేస్‌లో మాత్రం డౌన్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'స్కంద' 8 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

ఊరమాస్‌గా వచ్చిన స్కంద: రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఊరమాస్ సినిమానే 'స్కంద'. ఈ భారీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్‌ను అందించాడు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్: ఉస్తాద్ రామ్ నటించిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా దీనికి తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ జరిగింది.

8వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'స్కంద'కి 8వ రోజు ఆంధ్రా, తెలంగాణలో దారుణంగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 34 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

8 రోజులకూ కలిపి ఎంత?: 8 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 9.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.24 కోట్లు, గుంటూరులో రూ. 2.40 కోట్లు, కృష్ణాలో రూ. 1.32 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్లతో కలిపి.. రూ. 24.67 కోట్లు షేర్, రూ. 41.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 24.67 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.84 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.01 కోట్లు షేర్, రూ. 50.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 29.01 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.99 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











