Skanda 9 Days Collections: కోట్ల మూవీకి లక్షల్లో వసూళ్లు.. రామ్‌కు భారీ దెబ్బ.. అన్ని కోట్లు రావాలా!
బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో రామ్ పోతినేని. చిన్న వయసులోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో తడబడినా మళ్లీ ట్రాక్ ఎక్కాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే 'స్కంద' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదట్లోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ భారీగా దక్కాయి. కానీ, తర్వాత నుంచి ఇది డౌన్ అవుతూ వచ్చి ఇప్పుడు పుంజుకుంది. మరి 'స్కంద' 9 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
ఊరమాస్ అవతార్‌లో రామ్:రామ్ పోతినేని హీరోగా నటించిన ఊరమాస్ మూవీనే 'స్కంద'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

స్కంద మూవీ ప్రీ బిజినెస్:మాస్ యాక్షన్‌తో వచ్చిన 'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా దీనికి తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ అయింది.
9వ తెలుగు రాష్ట్రాల్లో ఇలా:9వ రోజు 'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 62 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

9 రోజులకూ కలిపి ఎంత?:ఏపీ, తెలంగాణలో 'స్కంద'కి 9 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 10.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.26 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.97 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, గుంటూరులో రూ. 2.46 కోట్లు, కృష్ణాలో రూ. 1.36 కోట్లు, నెల్లూరులో రూ. 1.09 కోట్లతో కలిపి.. రూ. 25.29 కోట్లు షేర్, రూ. 42.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 25.29 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.56 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.86 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 9 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.71 కోట్లు షేర్, రూ. 51.55 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఊరమాస్ కంటెంట్‌తో వచ్చిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 29.71 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.29 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











