Skanda Business: టాలీవుడ్‌లో రామ్ నయా రికార్డు.. ఒక్క ఏరియాకే అన్ని కోట్లతో సంచలనం

సినీ నేపథ్యంతో ఉన్న కుటుంబం నుంచే హీరోగా పరిచయం అయినా.. ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు రామ్ పోతినేని. దీనికితోడు తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా ఏర్పరచుకున్నాడు. ఇదే జోష్‌తో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ పోతినేని 'స్కంద' అనే మూవీని చేస్తున్నాడు.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి రామ్ పోతినేని చేస్తున్న సినిమానే 'స్కంద'. క్రేజీ కాంబినేషన్‌లో వస్తుండడంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Ram Pothineni Starrer Skanda Movie Ceeded Business Done For 9 Crore

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'స్కంద' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం. అప్పటి నుంచి కొన్ని బ్రేకులు వచ్చినా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలా ఇప్పటికే దాదాపుగా టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. అయితే, కొన్ని పాటలను మాత్రం షూట్ చేయాల్సి ఉంది. వాటిని కూడా వీలైనంత త్వరగా ఫినీష్ చేసేలా ప్లాన్ చేశారు.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న 'స్కంద' సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఇప్పుడు చిత్ర నిర్మాతలు ఈ మూవీ బిజినెస్ మీదనే ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేట్రికల్ హక్కులను భారీ ధరకు అమ్మినట్లు తెలిసింది.

Ram Pothineni Starrer Skanda Movie Ceeded Business Done For 9 Crore

రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న 'స్కంద' మూవీ సీడెడ్ ఏరియా హక్కులు రికార్డు స్థాయిలో రూ. 9 కోట్లు పలికినట్లు తెలిసింది. వీటిని ఓ ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేజిక్కించుకుందని సమాచారం. దీంతో ఈ ఏరియాలో అత్యధిక బిజినెస్ చేసిన టైర్ 2 హీరోగా టాప్‌లో ఉన్న విజయ్ దేవరకొండ (లైగర్ మూవీకి రూ. 9 కోట్లు) రికార్డును రామ్ సమం చేశాడు. ఈ రెండు మూవీ తర్వాత 'జయ జానకి నాయక', 'అఖిల్', 'దసరా' మూవీలు ఉన్నాయి.

Ram Pothineni Starrer Skanda Movie Ceeded Business Done For 9 Crore

ఇక, బోయపాటి శ్రీను - రామ్ పోతినేని కాంబోలో వస్తున్న 'స్కంద' సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X