Skanda Day 1 Collections: కుమ్మేసిన రామ్ మూవీ.. ఫస్ట్ డేనే అన్ని కోట్లతో రచ్చ.. టాప్ మూవీగా రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలతో తనదైన చిత్రాలతో అలరిస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. ఆ మధ్య వరుసగా హిట్లు కొట్టిన అతడు.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో ఇప్పుడు 'స్కంద' అనే సినిమాను చేశాడు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ టాక్‌తో పాటు మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో దీనికి అనుకున్న దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 'స్కంద' మూవీ తొలి రోజు రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
స్కందగా మారిపోయిన రామ్:రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రమే 'స్కంద'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు.

రామ్ కెరీర్‌లో టాప్ బిజినెస్:'స్కంద' మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు వ్యాపారం జరిగింది.

అలాంటి టాక్... వసూళ్లు ఇలా:ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'స్కంద' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా మిశ్రమంగా వచ్చాయి. అయినప్పటికీ హాలీడే కావడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి రోజు తెలుగులో వసూళ్లు:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'స్కంద' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్‌తో సంబంధం లేకుండానే రెస్పాన్స్ భారీగా లభించింది. సెలవు రోజు కావడంతో మ్యాట్నీ నుంచి ఈ చిత్రానికి బుకింగ్స్ పెరిగాయి. దీంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ. 6.50 - 7.50 కోట్లు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వరల్డ్ వైడ్‌గా ఎంత రావచ్చు:రామ్ నటించిన 'స్కంద' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు మంచి వసూళ్లే రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఇది ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేసిందనే ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా మిగిలిన భాషల వెర్షన్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. ఇలా ఫస్ట్ డే ఇది రూ. 10 కోట్లు వరకూ షేర్ వసూలు చేయబోతుంది.

టాప్ మూవీగా రికార్డు ఖాయం:'స్కంద' చిత్రానికి ఫస్ట్ డే మార్నింగ్, మ్యాట్నీ షోలతో పాటు ఫస్ట్ షో, సెకెండ్ షో అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే.. ఓవరాల్‌గా మంచి స్పందనే దక్కేలా ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లు వరకూ షేర్ రాబట్టవచ్చని అంటున్నారు. అదే జరిగితే రామ్ కెరీర్‌లోనే ఇది టాప్ మూవీగా రికార్డు సాధించవచ్చు.


Click it and Unblock the Notifications











