Skanda Day 1 Collections: స్కందకు ఊహించని వసూళ్లు.. ఫస్ట్ డేనే అన్ని కోట్లు.. రామ్ సంచలన రికార్డు

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను తనదైన రీతిలో అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలో లవ్ స్టోరీలతో వచ్చిన అతడు.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'స్కంద' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లు వచ్చాయా? లేదా? అన్నది చూద్దాం పదండి!

స్కందగా వచ్చిన హీరో రామ్:రామ్ పోతినేని హీరోగా.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ యాక్షన్ మూవీనే 'స్కంద'. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Ram Pothineni Starrer Skanda Movie Day 1 Worldwide Collections

రికార్డు బిజినెస్ చేసిన రామ్:'స్కంద' మూవీకి రికార్డు స్థాయిలో నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ జరిగింది.

టాక్ అలా.. కలెక్షన్లు మరోలా:భారీ అంచనాల నడుమ 'స్కంద' మూవీ గురువారమే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీ స్థాయిలో దక్కింది. దీంతో ఈ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లు వచ్చాయి.

Ram Pothineni Starrer Skanda Movie Day 1 Worldwide Collections

తొలి తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'స్కంద'కి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 1.04 కోట్లు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 49 లక్షలతో కలిపి.. రూ. 8.62 కోట్లు షేర్, రూ. 13.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

Ram Pothineni Starrer Skanda Movie Day 1 Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు రూ. 8.62 కోట్లు రాబట్టిన రామ్ పోతినేని 'స్కంద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.57 కోట్లు షేర్‌, రూ. 18.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Ram Pothineni Starrer Skanda Movie Day 1 Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'స్కంద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 10.57 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 36.43 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ram Pothineni Starrer Skanda Movie Day 1 Worldwide Collections

కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లతో:రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'స్కంద' మూవీకి మొదటి రోజు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 10.57 కోట్లు షేర్ రాబట్టింది. తద్వారా రామ్ కెరీర్‌లోనే టాప్ ఓపెనింగ్ మూవీగా ఇది రికార్డు సాధించింది. అలాగే, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఇది నాలుగో స్థానానికి సైతం చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X