The Warrior అరాచకంగా రామ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగచైతన్య మరో లెవెల్!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు కూడా వారి బాక్సాఫీస్ వద్ద వారి బలాన్ని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ పోతినేని ది వారియర్ సినిమా తమిళంలో కూడా విడుదల కాబోతున్న ఈ విషయం తెలిసిందే. ఇక సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎవరూ ఊహించని రేంజ్ లో జరగనున్నట్లు సమాచారం. నాగచైతన్య థాంక్యు సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

ముందుగా తమిళంలో..

ముందుగా తమిళంలో..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు కూడా స్టార్ హీరోలకు తక్కువ కాకుండా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా పాన్ ఇండియా ఇండియా లెవెల్ లో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా అదే తరహాలో అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందుగా వారు పక్కా ఇండస్ట్రీలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రామ్ పోతినేని తదుపరి సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి రూపొందుతున్న విషయం తెలిసిందే.

ది వారియర్ మూవీ

ది వారియర్ మూవీ

రామ్ పోతినేని గత కొంతకాలంగా వరుస సినిమాలతో తన మార్కెట్ను పెంచుకునే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా సక్సెస్ అనంతరం రామ్ పోతినేని అంతకుమించి అనేలా సక్సస్ అందుకోవాలనే రెడ్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు అతని ఆశలన్నీ కూడా ది వారియర్ సినిమా పైనే ఉన్నాయి.

భారీగా థియేట్రికల్ బిజినెస్

భారీగా థియేట్రికల్ బిజినెస్

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ తెలుగు తమిళంలో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులు దాదాపు 40 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. చూస్తుంటే రామ్ పోతినేని ఈ సినిమాతో పాన్ ఇండియా మార్గాన్ని మరింత సులువుగా చేసుకునే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

Recommended Video

Parusuram Next movie with Naga Chaitanya | Telugu Filmibeat
 నాగచైతన్య సినిమాకు కూడా..

నాగచైతన్య సినిమాకు కూడా..

మరోవైపు నాగచైతన్య కూడా తన స్టార్ హోదాను మరో లెవెల్ కు పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అతని తదుపరి సినిమా థాంక్యూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు కూడా ఇటీవల కాలంలో మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

థాంక్యూ థియేట్రికల్ బిజినెస్

థాంక్యూ థియేట్రికల్ బిజినెస్

థాంక్యూ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాత నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా మార్కెట్లో ఎదో ఒక విధంగా మంచి బిజినెస్ చేస్తుంది. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా థియేట్రికల్ హక్కులు దాదాపు 25 కోట్ల నుంచి 28 కోట్ల మధ్యలో అమ్ముడైనట్లు సమాచారం. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా థాంక్యు సినిమా నిలిచే అవకాశం ఉంది. ఇక సినిమా సక్సెస్ అయితే నాగచైతన్య మరో లెవల్ కి వెళ్లడం పక్కా అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X