The WARRIORR 11 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. అయినా తప్పని నిరాశ.. ఇంకెంత రావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ఎనర్జిటిక్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో 'ఇస్మార్ట్ శంకర్'తో రామ్ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
ఆ వెంటనే 'రెడ్'తో మరో హిట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి కలెక్షన్లు అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో వారియర్ 11 రోజుల్లో ఎంత వసూలు చూద్దాం పదండి!

ది వారియర్‌గా రామ్ విశ్వరూపం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ కలయికలో వచ్చిన సినిమానే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే
రామ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్' మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ చేసుకుంది.
11వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'ది వారియర్'కు 11వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మరింత పెరిగాయి. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 44 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలైంది.

11 రోజులకు కలిసి ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'ది వారియర్' 11 రోజుల్లో పెద్దగా రాణించలేదు. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.45 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.37 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.19 కోట్లు, గుంటూరులో రూ. 1.98 కోట్లు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 66 లక్షలతో కలిపి రూ. 17.63 కోట్లు షేర్, రూ. 27.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.63 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 68 లక్షలు, తమిళంలో రూ. 1.32 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 11 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.73 కోట్లు షేర్, రూ. 35.45 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రామ్ - లింగుసామీ జంటగా నటించిన 'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లో రూ. 20.73 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 18.27 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











