The WARRIORR 12 Days Collections: 50 శాతం వసూళ్లు డౌన్.. రామ్‌కు భారీ దెబ్బ.. అదే జరిగితే డిజాస్టరే

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. అంతేకాదు, ఆరంభంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్న అతడు.. స్టార్‌గా ఎదిగిపోయాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు సరైన బ్రేక్ లేక ఇబ్బంది పడిన రామ్.. 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే 'రెడ్'తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ 'ది వారియర్' మూవీ చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇది 12 రోజుల్లో ఎంత కలెక్షన్లు రాబట్టిందో మీరే చూడండి!

ది వారియర్‌గా వచ్చేసిన ఉస్తాద్

ది వారియర్‌గా వచ్చేసిన ఉస్తాద్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ తీసిన మాస్ మసాలా సినిమానే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజైంది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే

ది వారియర్ బిజినెస్ వివరాలివే

'ది వారియర్' మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు రామ్ మార్కెట్ ప్రకారమే ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

12వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

12వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


12వ రోజు 'ది వారియర్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు సగానికి పడిపోయాయి. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 22 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలైంది.

12 రోజులకు కలిసి ఎంత వచ్చింది?

12 రోజులకు కలిసి ఎంత వచ్చింది?

'ది వారియర్' ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో నిరాశనే ఎదుర్కొంది. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.48 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.39 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.20 కోట్లు, గుంటూరులో రూ. 2.00 కోట్లు, కృష్ణాలో రూ. 99 లక్షలు, నెల్లూరులో రూ. 67 లక్షలతో కలిపి రూ. 17.85 కోట్లు షేర్, రూ. 27.80 కోట్లు గ్రాస్‌ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

12 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 17.85 కోట్లు రాబట్టిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 69 లక్షలు, తమిళంలో రూ. 1.35 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 12 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.01 కోట్లు షేర్‌, రూ. 36.10 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

రామ్ నటించిన 'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లో రూ. 21.01 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 17.99 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X