The WARRIORR 13 Days Collections: వారియర్‌కు గడ్డు కాలం.. 13వ రోజు దారుణంగా.. ఇంకెంత రావాలంటే!
ఆ మధ్య కాలంలో చాలా రోజుల పాటు సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడినా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుని మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఆ వెంటనే 'రెడ్' అనే మూవీతో మరో విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడుతోంది. ఈ నేపథ్యంలో 'ది వారియర్' మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

ది వారియర్‌గా మారిన హీరో రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ కలయికలో చేసిన సినిమానే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే
'ది వారియర్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు రామ్ మార్కెట్ ప్రకారమే ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ చేసుకుంది.

13వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'ది వారియర్'కు 13వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 16 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్ వసూలైంది.

13 రోజులకు కలిసి ఎంత వచ్చింది?
'ది వారియర్' ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో తక్కువ వసూళ్లే వచ్చాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.50 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.40 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.21 కోట్లు, గుంటూరులో రూ. 2.02 కోట్లు, కృష్ణాలో రూ. 1.01 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో కలిపి రూ. 18.01 కోట్లు షేర్, రూ. 28.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 18.01 కోట్లు రాబట్టిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.14 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు, తమిళంలో రూ. 1.38 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 13 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.23 కోట్లు షేర్, రూ. 36.55 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లో రూ. 21.23 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 17.77 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











