The WARRIORR 15 Days Collections: 15వ రోజు అధ్వాన్నంగా.. టోటల్‌గా 10 లక్షలా.. ఇదేం అరాచకం సామీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ సహా ఎన్నో విద్యలను చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న రామ్.. ఇటీవలే 'ది వారియర్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'ది వారియర్' 15 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

ది వారియర్‌గా హీరో రామ్ సందడి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ రూపొందించిన మాస్ మూవీనే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే
రామ్ పోతినేని మార్కెట్, సినిమాపై అంచనాల వల్ల 'ది వారియర్' మూవీకి బిజినెస్ భారీగా జరిగింది. ఈ చిత్రానికి నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

15వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ది వారియర్' మూవీ రామ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. కానీ, ఆరంభంలోనే దీనికి మిక్స్‌డ్ టాక్ రావడం కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో ఏపీ, తెలంగాణలో అంతగా కలెక్షన్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో 15వ రోజైన గురువారం ఈ చిత్రానికి కేవలం 7 లక్షలు మాత్రమే వచ్చాయి.

15 రోజులకు కలిసి ఎంత వచ్చింది?
'ది వారియర్' ఏపీ, తెలంగాణలో 15 రోజుల్లో తక్కువ వసూళ్లే వచ్చాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.51 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.42 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.21 కోట్లు, గుంటూరులో రూ. 2.04 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో కలిపి రూ. 18.19 కోట్లు షేర్, రూ. 28.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
15 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 18.19 కోట్లు రాబట్టిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 72 లక్షలు, తమిళంలో రూ. 1.41 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 15 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.48 కోట్లు షేర్, రూ. 37.10 కోట్ల గ్రాస్ వచ్చింది.
స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లో రూ. 21.48 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 17.52 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ చిత్రానికి నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











