The WARRIORR 1st Week Collections: 39 కోట్ల టార్గెట్.. వారంలో ఘోరంగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న స్టార్లలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ పరిస్థితుల్లోనే రామ్ వరుసగా 'ఇస్మార్ట్ శంకర్', 'రెడ్' వంటి వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడీ ఎనర్జిటిక్ హీరో 'ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు మిశ్రమంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి వారంలో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

ది వారియర్‌గా ఎంటరైన ఉస్తాద్
ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని - కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ కలయికలో వచ్చిన సినిమానే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ది వారియర్' మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ చేసుకుంది.

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7వ రోజు 'ది వారియర్'కు కలెక్షన్లు తగ్గాయి. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 42 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

వారం రోజులకు ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'ది వారియర్' వారం రోజుల్లో పెద్దగా రాణించలేదు. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.27 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.26 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.12 కోట్లు, గుంటూరులో రూ. 1.87 కోట్లు, కృష్ణాలో రూ. 90 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో కలిపి రూ. 16.35 కోట్లు షేర్, రూ. 25.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.35 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సోసోగానే రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు, తమిళంలో రూ. 1.10 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 7 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.02 కోట్లు షేర్, రూ. 32.20 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రామ్ పోతినేని హీరోగా నటించిన 'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రూ. 19.02 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 19.98 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











