The WARRIORR 2 Weeks Collections: 39 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో ఇంతే.. అన్నికోట్లు వస్తేనే హిట్

రామ్ పోతినేని.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ కుర్రాడు సుదీర్ఘ కాలంగా తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నా రామ్.. రెండు వారాల క్రితమే 'ది వారియర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా అవి పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'ది వారియర్' మూవీ 2 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

 ది వారియర్‌గా హీరో రామ్ రచ్చ

ది వారియర్‌గా హీరో రామ్ రచ్చ


ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ రూపొందించిన మాస్ మూవీనే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజైంది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే

ది వారియర్ బిజినెస్ వివరాలివే


రామ్ పోతినేని మార్కెట్‌కు అనుగుణంగానే 'ది వారియర్' మూవీకి బిజినెస్ భారీగా జరిగింది. ట్రేడ్ లెక్క ప్రకారం ఈ చిత్రానికి నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్‌ అయింది.

14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

14వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


14వ రోజు 'ది వారియర్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. 70 వేలు, వెస్ట్‌లో రూ. 30 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో కలిపి రూ. 11 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వసూలైంది.

 2 వారాలకూ కలిసి ఎంత వచ్చింది?

2 వారాలకూ కలిసి ఎంత వచ్చింది?


'ది వారియర్' ఏపీ, తెలంగాణలో 2 వారాల్లో తక్కువ వసూళ్లే వచ్చాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.50 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.21 కోట్లు, గుంటూరులో రూ. 2.03 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో కలిపి రూ. 18.12 కోట్లు షేర్, రూ. 28.30 కోట్లు గ్రాస్‌ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


2 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 18.12 కోట్లు రాబట్టిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 71 లక్షలు, తమిళంలో రూ. 1.40 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 14 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.38 కోట్లు షేర్‌, రూ. 36.90 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 వారాల్లో రూ. 21.38 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 17.62 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ చిత్రానికి నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X