The WARRIORR 4 Days Collections: సండే షాకింగ్ కలెక్షన్స్.. 4 రోజుల్లో ఇంతే.. ఇంకెంత రావాలంటే!

టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంటర్ అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇక, ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ఇటీవలి కాలంలో 'ఇస్మార్ట్ శంకర్', 'రెడ్' వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ది వారియర్' అనే చిత్రం చేశాడు. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

ది వారియర్‌గా మారిపోయిన రామ్

ది వారియర్‌గా మారిపోయిన రామ్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీ తెరకెక్కించిన చిత్రమే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఆది పినిశెట్టి ఇందులో విలన్‌గా నటించాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

ది వారియర్ బిజినెస్ వివరాలివే

ది వారియర్ బిజినెస్ వివరాలివే

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ది వారియర్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. తమిళంలోనూ దీనికి డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 38.10 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

4వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ది వారియర్'కు మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 84 లక్షలు, సీడెడ్‌లో రూ. 62 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 43 లక్షలు, ఈస్ట్‌లో రూ. 23 లక్షలు, వెస్ట్‌లో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి రూ. 2.86 కోట్లు షేర్, రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

4 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

ఏపీ, తెలంగాణలో 'ది వారియర్' 4 రోజుల్లో ఇలా వసూలు చేసింది. ఈ సినిమా నైజాంలో రూ. 4.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.06 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.12 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.03 కోట్లు, గుంటూరులో రూ. 1.76 కోట్లు, కృష్ణాలో రూ. 80 లక్షలు, నెల్లూరులో రూ. 55 లక్షలతో కలిపి రూ. 14.59 కోట్లు షేర్, రూ. 22.45 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రూ. 14.59 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సోసోగానే రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు, తమిళంలో రూ. 82 లక్షలు కలెక్ట్ చేసింది. దీంతో 4 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.76 కోట్లు షేర్‌, రూ. 28.00 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ది వారియర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 రోజుల్లో రూ. 16.76 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 22.24 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ను సొంతం చేసుకుంటుంది.

మొదటి వీకెండ్‌లో షాకింగ్‌గానే

మొదటి వీకెండ్‌లో షాకింగ్‌గానే

రామ్ పోతినేని - లింగుసామీ కాంబోలో వచ్చిన 'ది వారియర్' మూవీకి టాక్ అనుకున్న రీతిలో రాలేదు. దీంతో ఈ సినిమాకు స్పందన కూడా అంతగా దక్కడం లేదు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై భారీగా చూపించింది. అందుకే వీకెండ్‌లో కేవలం ఈ సినిమా రూ. 16.76 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక, వీక్ డేస్‌లో ఈ చిత్రానికి అసలైన పరీక్ష ఎదురు కాబోతుందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X