twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The WARRIORR Total Collections: 39 కోట్లు బిజినెస్.. రామ్‌‌ రాబట్టింది ఇంతే.. నష్టం ఎన్ని కోట్లంటే!

    |

    సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనా.. తనదైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ఉస్తాద్ రామ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మధ్యలో భారీ సక్సెస్ లేక ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకోవడంతో పాటు మరోసారి ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'రెడ్' వంటి సక్సెస్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ది వారియర్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మాస్ యాక్షన్ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన అంతగా రాలేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ ముందు తేలిపోయింది. ఈ నేపథ్యంలో 'ది వారియర్' క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

    ది వారియర్‌గా హీరో రామ్ సందడి

    ది వారియర్‌గా హీరో రామ్ సందడి

    ఉస్తాద్ రామ్ పోతినేని - కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామీ కలయికలో వచ్చిన మాస్ మూవీనే ‘ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ గ్రాండ్‌గా రిలీజైంది.

    Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

    ది వారియర్ బిజినెస్ వివరాలివే

    ది వారియర్ బిజినెస్ వివరాలివే

    రామ్ పోతినేని మార్కెట్, సినిమాపై అంచనాల నేపథ్యంలో ‘ది వారియర్' మూవీకి బిజినెస్ భారీగా జరిగింది. ఈ చిత్రానికి నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్‌ జరిగింది.

    అలాంటి రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

    అలాంటి రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

    టాలెంటెడ్ డైరెక్టర్‌గా లింగుసామీ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన చిత్రమే ‘ది వారియర్'. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఈ సినిమా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిందనే చెప్పుకోవాలి.

    బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

    ‘ది వారియర్'కు ఏపీ, తెలంగాణలో ఫుల్ రన్‌లో తక్కువ వసూళ్లే వచ్చాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 6.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.54 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.22 కోట్లు, గుంటూరులో రూ. 2.03 కోట్లు, కృష్ణాలో రూ. 1.01 కోట్లు, నెల్లూరులో రూ. 69 లక్షలతో కలిపి రూ. 18.30 కోట్లు షేర్, రూ. 28.75 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ఫుల్ రన్‌లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 18.30 కోట్లు రాబట్టిన ‘ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు, తమిళంలో రూ. 1.50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో టోటల్‌గా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.65 కోట్లు షేర్‌, రూ. 37.40 కోట్ల గ్రాస్ వచ్చింది.

    పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

     బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

    అంచనాలకు అనుగుణంగానే రామ్ పోతినేని నటించిన ‘ది వారియర్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 21.65 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా రామ్ నటించిన ఈ సినిమా రూ. 17.35 కోట్లు నష్టాలను చవి చూసి నిరాశనే మిగిల్చింది.

    Recommended Video

    NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia
    ఆగస్టు 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్

    ఆగస్టు 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్


    రామ్ పోతినేని - కృతి శెట్టి జంటగా నటించిన మాస్ మసాలా మూవీ ‘ది వారియర్' ఎన్నో అంచనాలతో వచ్చినా థియేటర్‌లో పెద్దగా సందడి చేయలేకపోయింది. దీంతో ఈ చిత్రానికి చాలా నష్టాలు కూడా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ స్ట్రీమింగ్ చేసుకోబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.

    English summary
    Ram Pothineni Did The WARRIORR Movie Under Kollywood Director Lingusamy Direction. This Movie Collects Rs 21.65 Cr in Full Run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X