The Warriorr day3: శుక్రవారం కంటే పుంజుకున్న కలెక్షన్లు.. కానీ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రావాలంటే?
టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముందు నుంచి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో అటు సాధారణ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు . మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే దాని మీద ఒక లుక్కు వేద్దాం.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
తమిళ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలోనే విడుదల అయిన సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

భారీ స్టార్ క్యాస్టింగ్
ది వారియర్ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అక్షర గౌడ, నదియా, రెడిన్ కింగ్ల్సే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అంబరివ్ మాస్టర్, విజయ్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫి చేయగా సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాం :10 కోట్లు, సీడెడ్ : 5 కోట్లు, ఆంధ్ర: 15 కోట్లు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక అలాగే కర్ణాటక సహా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఇక అలాగే ఓవర్ సీస్ లో 2.10 కోట్ల బిజినెస్ చేసింది, అలాగే తమిళ వర్షన్ 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38.10 కోట్ల బిజెస్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ 39.00 కోట్లుగా ఫిక్స్ అయింది.

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో
ఇక ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఏరియా వారీగా చూసుకుంటే నైజాం: 1.02 కోట్లు, సీడెడ్: 48 లక్షలు, ఉత్తరాంధ్ర : 29 లక్షలు, ఈస్ట్ : 17 లక్షలు, వెస్ట్: 9 లక్షలు, గుంటూరు: 17 లక్షలు, కృష్ణా : 17 లక్షలు, నెల్లూరు: 12 లక్షలు వసూలు అయ్యాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 2.41 కోట్లు షేర్ వసూళ్లు, 3.90 గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

మూడు రోజులకు గాను
ఇక ఈ సినిమా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. నైజాం: 3.87 కోట్లు, సీడెడ్: 1.94 కోట్లు, ఉత్తరాంధ్ర : 1.63 కోట్లు, ఈస్ట్ : 89 లక్షలు, వెస్ట్: 85 లక్షలు, గుంటూరు: 1.55 కోట్లు, కృష్ణా : 57 లక్షలు, నెల్లూరు: 43 లక్షలు వసూలు అయ్యాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 11.73 కోట్లు షేర్ వసూళ్లు, 17.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో
ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి వసూళ్లు సాదించింది. కర్నాటక సహా మిగతా భారతదేశంలో : 62 లక్షలు, ఓవర్ సీస్ లో: 50 లక్షలు, తమిళంలో : 60 లక్షలు వసూలు అయ్యాయి. ఇక అలా ప్రపంచవ్యాప్తంగా : 13.45 కోట్లు షేర్, 21.30 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ 39 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఇంకా ఈ సినిమా 25.55 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











