The Warriorr 9 Days Collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. ఇక టార్గెట్ అసాధ్యమే!
హీరో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి వీకెండ్ లో సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా తొమ్మిదో రోజు కూడా బాగా వెనుక పడిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది అనేది బాక్స్ ఆఫీస్ రిపోర్టులో పరిశీలిద్దాం

బిజినెస్
తమిళ సినిమాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమాలు విడుదలకు ముందు మంచి మంచి బజ్ క్రియేట్ అయింది. రామ్ తన కెరీర్ లో మొట్ట మొదటి సారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగాఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో సినిమాకు మంచి మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ రోజు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు 'ది వారియర్'కు కలెక్షన్లు చాలా తగ్గాయి. ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్ష, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి టోటల్ గా రూ. 23 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

9 రోజుల్లో
'ది వారియర్' మొత్తం 9 రోజుల్లో రాబట్టిన కలెక్షన్స్ నైజాంలో రూ. 5.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.34 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.30 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.14 కోట్లు, గుంటూరులో రూ. 1.91 కోట్లు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 63 లక్షలతో కలిపి రూ. 16.86 కోట్లు షేర్, రూ. 26.10 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా
9 రోజుల్లో ఆంద్ర తెలంగాణలో రూ. 16.63 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 98 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 63 లక్షలు, తమిళంలో రూ. 1.15 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 9 రోజుల్లోనే సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.39 కోట్లు షేర్, రూ. 32.90 కోట్ల గ్రాస్ వచ్చింది.

సక్సెస్ కావాలి అంటే
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల వారి అంచనాల మేరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ది వారియర్ ఫస్ట్ వీకెండ్ లో బాగానే రాబట్టినా తరువాత వెనుక పడింది. మొత్తంగా 9 రోజుల్లో సినిమా రూ. 19.72 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమా సక్సెస్ కావాలి అంటే మరో రూ. 19.28 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. ఇక ఈ పరిస్థితుల్లో ఈ లెక్క చేరుకోవడం అంటే కష్టం అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











