పెద్ద ఎత్తున విడుదలవుతున్న ది వారియర్.. ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుందంటే
రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ది వారియర్. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. రామ్ కెరియర్ లో మొట్ట మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్, ఇతర విషయాలు కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయి.. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ సినిమా మీద అమాంతం ఆసక్తి పెంచేశాయి. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం అందించిన సంగీతం కూడా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం కూడా బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 43 కోట్ల పది లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అయితే ఇక తాజాగా ఈ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవుతున్న విషయం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో 250కి పైగా థియేటర్లలో విడుదలవుతుంటే సీడెడ్ ప్రాంతంలో 145కు పైగా థియేటర్లలో విడుదలవుతోంది.

అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కలిపి 300 ధియేటర్లకు పైగా ఈ సినిమా విడుదలవుతోంది. అలా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం 700 లకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఇక ఇవి కాక కర్ణాటక సహా తమిళనాడు అలాగే ఇతర రాష్ట్రాలలో 235 థియేటర్లలో విడుదలవుతోంది అలాగే కేవలం ఓవర్సీస్ లోని 350కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1280 థియేటర్లలో విడుదలవుతోంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు నుంచి కూడా భారీ ప్రచారం జరగడంతో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











