RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..

సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి ఒక కొత్త బాక్సాఫీస్ ఆరంభం అనే చెప్పాలి. ఓ వైపు కరోనా మరోవైపు థియేటర్స్ సిట్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ అందాయి. జనవరి 14న రెడ్ సినిమాతో పాటు అల్లుడు అదుర్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక రెడ్ సినిమా ఇప్పటివరకు దక్కించుకున్న కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

Recommended Video

Master దూసుకుపోతున్నాడు.. Thalapathy Vijay మూవీ కి గ్రాండ్ ఓపెనింగ్ !

థియేటర్స్ లో మాస్టర్ హంగామా (ఫొటోలు)

థియేటర్స్ లో పోటాపోటీగా..

థియేటర్స్ లో పోటాపోటీగా..

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా రెడ్. తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక మరో సినిమా అల్లుడు అదుర్స్ కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ రెండు సినిమాలు థియేటర్స్ కోసం చివరి వరకు గట్టిగానే పోరాడినట్లు టాక్ వస్తోంది.

స్ట్రాంగ్ ఓపెనింగ్స్..

స్ట్రాంగ్ ఓపెనింగ్స్..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గొడవలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా రెడ్ సినిమాకు ఇప్పుడు థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఆ విషయం పక్కన పెడితే.. సినిమా కలెక్షన్స్ మొదటి రోజు బాగానే వచ్చాయి. హాలిడేస్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాలకు బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక రెడ్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను అందుకున్నట్లు సమాచారం.

రెడ్ 4వ రోజు కలెక్షన్స్..

రెడ్ 4వ రోజు కలెక్షన్స్..

ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా అనంతరం రామ్ పోతినేని చేస్తున్న సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇక సినిమా నాలుగవ రోజు రూ.2.14కోట్ల వరకు షేర్స్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్ కేవలం 50% కెపాసిటీ సిట్టింగ్ తో నడుస్తున్నప్పటికి టికెట్స్ రేట్లు పెంచడంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..

ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..

రెడ్ సినిమాకు మొదటిరోజే మిక్సీడ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ సినిమా ప్రతి రోజు మంచి వసూళ్లను అందుకుంటూ ముందుకు సాగింది. ఆంద్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం 14.49కోట్లు రాగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ కలిపి 66లక్షలు. ఓవర్సీస్ లో 30లక్షల షేర్ మాత్రమే రాగా ఇప్పటివరకు వచ్చిన మొత్తం షేర్స్ 15.45కోట్లు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం 14కోట్లే. ఇక ఇప్పుడు 15కోట్లు దాటడంతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X