Just In
- 4 min ago
ఆ ఒక్క మాటతో ఎంతో బాధ.. ఎస్పీబీపై చిరంజీవి ఎమోషనల్
- 1 hr ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 1 hr ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 3 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
Don't Miss!
- Sports
ఐపీఎల్ వేలం ముందు కుర్రాళ్లకు పరీక్ష.. నేటి నుంచి ముస్తాక్ అలీ క్వార్టర్ ఫైనల్స్!
- News
తిరుపతి కోసం బీజేపీ-జనసేన స్కెచ్-తెరపైకి కర్నాటక మాజీ సీఎస్-జగన్ కేసుల్లోనూ..
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'రెడ్' అడ్వాన్స్ బుకింగ్స్.. మరీ ఇంత స్లోగానా.. రామ్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్ సినిమాలు రెండు కూడా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక గురువారం రామ్ రెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రామ్ రెడ్ సినిమా బ్రేక్ ఈవెన్ వంటి విషయాల్లోకి వెళితే..

ఒక్కసారిగా పెరిగిన మార్కెట్..
రామ్ చివరగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతకుముందు కేవలం లవ్ స్టోరీలతో ఫ్యామిలీ కాన్సెప్ట్ లతో హిట్ కొట్టిన రామ్ ఇస్మారర్ట్ శంకర్ సినిమాతో మాత్రం మాస్ ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాడు. ఆ సినిమాతో రామ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న రెడ్
ఇక తమిళ్ మూవీ తడమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన రెడ్ సినిమాతో అదే స్థాయిలో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రామ్. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జనవరి 14న ఫైనల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ అవుతోంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు.

అడ్వాన్స్ బుకింగ్స్.. డల్ గానే..
ఇక సినిమా హిట్టవ్వడం కాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గానే ఉంది. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. ఒకవైపు తమిళ్ మాస్టర్ సినిమా హై రేంజ్ లో ఓపెనింగ్స్ తోనే వైరల్ అవుతుంటే రామ్ సినిమాకు మాత్రం అనుకున్నంత రేంజ్ లో హైప్ దక్కించికోవడం లేదు.

బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..
కేవలం 50% కెపాసిటీతో సగం టికెట్స్ ఉంటాయి కాబట్టి జనాలు ఎగబడి బుక్ చేసుకుంటారని అనుకున్నన్నారు. క్రాక్ సినిమా అయితే మొదట హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. ఇక రెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 20కోట్లయినా రాబట్టాల్సిందే. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 17.5కోట్లని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 15.5కోట్లు. మరి సినిమా రేపటి నుంచి ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.