twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ 'పండగ చేస్కో' శాటిలైట్ రేటు షాకిస్తోంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో' విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం మే 14 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీ రిలిజ్ బిజినెస్ షాకిచ్చే రేంజిలో జరుగుతున్నట్లు సమాచారం. రామ్ ఫ్లాఫుల్లో ఉన్నా...దర్శకుడు గోపిచంద్ మలినేని పై ఉన్న నమ్మకమే బిజినెస్ వర్గాలకు నమ్మకాలు ప్రాజెక్టుపై పెంచేలా చేస్తోంది.

    రీసెంట్ గా..ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 6 కోట్లకు జీ తెలుగు వారు తీసుకున్నట్లు సమాచారం. ఫ్యామలీ ఎంటర్టైనర్ కావటం, కోన వెంకట్ కాంబినేషన్ ,రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ కావటం, బ్రహ్మానందం కామెడీ ఈ స్ధాయి బిజినెస్ కు కారణం అంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ ఖాయం అంటున్నారు. అదే నిజమైతే రామ్ పై గత చిత్రాల ఫ్లాపు ఎఫెక్టు పడనట్లే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Ram's Pandaga Chesko shocking satellite rights

    తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పండగచేస్కో ద్వారా మనముందుకు వస్తున్నాడు రామ్.

    ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర కీలకం కానుంది. బ్రహ్మానందం...ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా రామ్ తాజా చిత్రం పండుగ చేస్కో లో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రతో మరో సారి తన ట్రేడ్ మార్క్ ని చూపించి సినిమాకు ప్లస్ అవనున్నాడని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

    Ram's Pandaga Chesko shocking satellite rights

    దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

    రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

    English summary
    Zee Telugu acquired Pandaga Chesko satellite rights for a whopping amount of Rs 6 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X