The Warriorr భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందంటే?

యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ తో మాస్ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు చెబుతున్నారు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమేర జరిగింది అనే విషయం మీద ఒక లుక్కు వేద్దాం.

పాజిటివ్ వైబ్రేషన్స్

పాజిటివ్ వైబ్రేషన్స్

తమిళ ప్రముఖ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన బుల్లెట్ సాంగ్ అయితే రెండు భాషల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

ఎంతో ఆతృతగా

ఎంతో ఆతృతగా

ఇక ఈ సినిమా మీద బజ్ మరింత పెంచేందుకు రామ్ పోతినేని రెండు భాషల్లో రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక చెన్నైలో కూడా ఎక్కడికి వెళ్లిన మంచి రెస్పాన్స్ అయితే దక్కుతోంది. దీంతో ది వారియర్ సినిమా అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. లింగస్వామికి అక్కడ మంచి మార్కెట్ ఉండడంతో ది వారియర్ సినిమా కోసం తమిళపేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.

మంచి రెస్పాన్స్

మంచి రెస్పాన్స్

జూలై 14వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్వకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆ మధ్య అనంతపురంలో రిలీజ్ చేశారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా తెలుగు ట్రైలర్, శివకార్తీకేయన్ ట్విట్టర్‌లో తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సాధించాయి.

ఆది పినిశెట్టి విలన్‌గా

ఆది పినిశెట్టి విలన్‌గా

ది వారియర్ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అక్షర గౌడ, నదియా, రెడిన్ కింగ్ల్సే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అంబరివ్ మాస్టర్, విజయ్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫి చేయగా సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాం :11 కోట్లు, సీడెడ్ : 6 కోట్లు, ఉత్తరాంధ్ర: 17 కోట్లు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక అలాగే కర్ణాటక సహా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఇక అలాగే ఓవర్ సీస్ లో 2.10 కోట్ల బిజినెస్ చేసింది, అలాగే తమిళ వర్షన్ 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 43.10 కోట్ల బిజెస్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ 44.00 కోట్లుగా ఫిక్స్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X