Ramabanam closing Collections 32 కోట్ల బడ్జెట్.. 17 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల నష్టమంటే?

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల రూపొందించిన చిత్రం రామబాణం. మాచో స్టార్ గోపిచంద్, యువ హీరోయిన్ డింపుల్ హయతి, సీనియర్ నటులు జగపతిబాబు, కుష్బూ, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రం మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ సినిమాకు థియేట్రికల్ రన్‌లో వచ్చిన కలెక్షన్లు ఎంత? అనే విషయంలోకి వెళితే..

32 కోట్ల బడ్జెట్‌తో: రామబాణం చిత్రంలో భారీగా నటీనటులతో రూపొందింది. భారీ సెట్, విదేశాల్లో షూటింగ్, యాక్షన్ సీన్లతో ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మించడం వల్ల 32 కోట్ల బడ్జెట్ వరకు అయిందనేది ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాకు ప్రమోషన్స్ భారీగానే నిర్వహించారు. దాంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడటమే కాకుండా బిజినెస్ కూడా భారీగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 Ramabanam closing Collections

బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లుగా : రామబాణం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4.5 కోట్లకు, సీడెడ్‌లో 2 కోట్లకు, ఆంధ్రాలో 6 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి, ఓవర్సీస్ 1.5 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 15 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లుగా నిర్ణయించారు.

 Ramabanam closing Collections

ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్లలో : రామబాణం సినిమాకు మంచి కాస్టింగ్ ఉండటం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేది ప్రమోషన్స్‌లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించడం, టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 200 పైగా, సీడెడ్‌లో 100 పైగా, ఆంధ్రాలో 300కి పైగా కలిపి మొత్తం 600పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో కలిపి 850 స్క్రీన్లలో ప్రదర్శించారు.

 Ramabanam closing Collections

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు : రామబాణం సినిమా విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్‌ రావడంతో తొలి రోజు 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయింది. రెండో రోజు 1.5 కోట్లు, మూడో రోజు 1.4 కోట్లు వసూలు చూసింది. తొలివారం ముగిసే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 కోట్ల రూపాయలు థియేట్రికల్‌గా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 7.25 కోట్లు వసూలు చేసింది.

 Ramabanam closing Collections

రామబాణానికి లాభమా? నష్టమా? : రామబాణం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తర్వాత 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే తొలివారమే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం 7 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 4 కోట్ల షేర్ వరకు రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం సుమారు 12 కోట్ల నష్టం థియేట్రికల్‌గా నమోదు చేసిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X