Ramarao on duty day 1 collections రవితేజ‌కు మాస్ రెస్సాన్స్.. తొలి రోజు పరిస్థితి ఎలా ఉందంటే?

యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 28వ తేదీన రిలీజైంది. రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్, వేణు తొట్టెంపుడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన రావడం, ప్రమోషన్ కార్యక్రమాలు బ్రహ్మండంగా జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

రామారావు అన్ డ్యూటీకి హీరో రవితేజ సహ నిర్మాతగా వ్యవహరించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాంలో ఈ చిత్రం 5 కోట్లు, సీడెడ్‌లో 3 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల మేర బిజినెస్ జరగడంతో 15 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో డీల్ సెట్ అయింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి, ఓవర్సీస్‌లో 1.2 కోట్లు బిజినెస్‌తో మొత్తంగా 17.20 కోట్ల బిజినెస్ నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో స్పందన ఎలా అంటే

తెలుగు రాష్ట్రాల్లో స్పందన ఎలా అంటే


రామారావు ఆన్ డ్యూటీ చిత్రం 18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.అయితే మూడు రోజుల ముందే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ పెద్దగా స్పందన లభించలేదు. అయితే రిలీజ్ రోజున కరెంట్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. మిగితా సెంటర్లలో 40 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది.

ఫస్ట్ డే రోజున కలెక్షన్లు ఇలా

ఫస్ట్ డే రోజున కలెక్షన్లు ఇలా

రామారావు ఆన్ డ్యూటీ తొలి రోజు ట్రేడ్ నిపుణుల రిపోర్టు ప్రకారం.. ఆంధ్రా విషయానికి వస్తే చిత్తూరులో తొలి రోజు 1.8 లక్షలు, ఏలూరులో 3.4 లక్షలు నమోదు చేసింది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో మంచి స్పందన లభించింది. వైజాగ్‌, శ్రీకాకుళం, విజయనగరం, పలాస, నర్సన్నపేట ప్రాంతాల్లో కొన్ని షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక హైదరాబాద్‌లో తొలి రోజు 4 లక్షల వసూళ్లు సాధించింది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా

తొలి రోజు కలెక్షన్ల అంచనా

ఇక తెలుగు రాష్ట్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తొలి రోజు నైజాంలో 1.5 కోట్ల గ్రాస్, సీడెడ్‌లో 1 కోటి, ఆంధ్రాలో సుమారు 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల లోపు వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది.

రామారావు లాభాల్లోకి రావాలంటే..

రామారావు లాభాల్లోకి రావాలంటే..

రామారావు ఆన్ డ్యూటీకి సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన కనిపిస్తున్నది. తొలి రోజు వసూళ్ల మాదిరిగా ఈ వారాంతం కలెక్షన్లను రాబడితే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని అధిగమిస్తుందా లేదా రెండు రోజులు వేచి చూస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X