Ramayana: రామాయణ బిజినెస్ నెక్స్ట్ లెవెల్.. హిందీ రైట్స్‌కే అన్ని కోట్లా?

Ramayana Pre-Release Business: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సినిమా రామాయణ (Ramayana). ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సౌత్ టాలెంటెడ్ నటి సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. ఈ ఈ మల్టీ-పార్ట్ ఎపిక్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా (Namit Malhotra) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదల కాకముందే ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది.

ఈ భారీ బడ్డెట్ కు సంబంధించిన థియేట్రికల్ హక్కులు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ రైట్స్ కోసం నిర్మాతలు రూ. 400 నుంచి రూ. 450 కోట్ల వరకు డిమాండ్ చేస్తుండటంతో పంపిణీదారులు కంగారు పడుతున్నారు. అంత భారీ మొత్తాన్ని పెట్టడం రిస్క్‌గా భావిస్తున్న బయ్యర్లు, డీల్‌ను రూ. 300 కోట్ల వరకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ రేటుకు డీల్ ఫైనల్ అయితే, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ థియేట్రికల్ డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను సైతం ఈ సినిమా సులభంగా అధిగమిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Ramayana Pre-Release Business

కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు, ఓటీటీ డిజిటల్ రైట్స్ విషయంలో కూడా మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్ ఫిక్స్(Netflix) రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం దాదాపు రూ.700 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను నిర్మాతలు తిరస్కరించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విలువను దృష్టిలో పెట్టుకుని, కనీసం రూ. 1,000 కోట్లకు తక్కువకు ఒప్పుకోరని మేకర్స్ పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

ఇక విడుదల తేదీ విషయంలో కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదట ఈ సినిమా 2026 దీపావళి సందర్భంగా విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఒక వారం ముందుగానే థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30,2026న గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహం వెనుక ఉన్న కారణం కూడా భారీ బిజినెట్ స్ట్రాటజీ ఉందట. పండగకు ముందు విడుదల చేస్తే, మొదటి వారం వచ్చిన పాజిటివ్ టాక్ రెండో వారం దీపావళి హాలిడేస్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునే అవకాశం ఉందట.

ఈ వ్యూహం నిర్మాత నమిత్ మల్హోత్రా మాస్టర్ ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. మొదటి వారం మౌత్ టాక్ బలంగా ఉంటే, రెండో వారం కలెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుతాయని ఆయన లెక్కలు వేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ డీల్స్, ఓటీటీ చర్చలు తుది దశకు చేరుకుంటుండటంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ 'రామాయణ'సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 నుంచి 1,500 కోట్ల వరకు వసూళ్లు సాధించే సత్తా కలిగి ఉందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2,500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు.

మొత్తంగా చూస్తే, 'రామాయణం' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు... ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి గేమ్ చేంజర్‌గా మారే ప్రాజెక్ట్‌గా కనిపిస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి బిజినెస్, అంచనాలు సృష్టించడం అరుదైన విషయం. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ ఎపిక్ డ్రామా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో అన్నది ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X