‘రామయ్యా వస్తావయ్యా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విడుదలై వారం రోజులు పూర్తయింది. తొలి వారం ఈచిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. జూ ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలు తలక్రిందులయ్యాయి.
సినిమా నెగెటివ్ టాక్, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తుఫాన్ ఎఫుక్ట్ కారణంగా సినిమాకు తొలి వారం ఆశించిన వసూళ్లు రాలేదు. జూ ఎన్టీఆర్ గత చిత్రం 'బాద్ షా' ఫస్ట్ వీక్ కలెక్షన్లు అధిగమించడంలో కూడా 'రామయ్యా వస్తావయ్యా' విఫలమైంది. అయితే విడుదలకు ముందు ఉన్న భారీ అంచనాల కారణంగా సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
వరల్డ్ వైడ్‌గా దాదాపు 1500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం తొలి ఏడే రోజుల్లో రూ. 58.96 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు అంచనా. తొలి రోజు శుక్రవారం రూ. 9.50 కోట్లు, శనివారం రూ. 10 కోట్లు, ఆదివారం రూ. 9.55 కోట్లు, సోమవారం రూ. 8.06 కోట్లు, మంగళవారం రూ. 7.80 కోట్లు, బుధవారం రూ. 7.20 కోటలు, గురువారం రూ. 6.75 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మొత్తం కలెక్షన్లో అన్ని ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన మొత్తం పోగా....చిత్ర నిర్మాత దిల్ రాజుకు వచ్చిన ఫస్ట్ వీక్ షేర్ రూ. 24 కోట్ల నుంచి రూ. 26 కోట్ల దక్కినట్లు చెబుతున్నారు. కలెక్షన్ల వివరాలు అఫీషియల్‌గా తెలియాల్సి ఉంది. పరిస్థితి చూస్తుంటే బాక్సాఫీసు వద్ద సినిమా ఎక్కువ రోజులు నిలదొక్కుకునేలా లేదని టాక్.


Click it and Unblock the Notifications












