twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aranya 4 days collections: రానా 60కోట్ల సినిమా.. టార్గెట్ అందుకోకపోతే వచ్చే నష్టమెంత?

    |

    రానా దగ్గుబాటి నటించిన పాన్ ఇండియా సినిమా అరణ్య గత శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడే ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక రానా ఫస్ట్ లుక్ లాంటివి వచ్చిన తరువాత సినిమా బిజినెస్ కూడా మారిపోయింది. ఎంతో నమ్మకంతో భారీగానే ఖర్చు పెట్టారు. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కనీసం సగం కూడా తీసుకు వచ్చేలా కనిపించడం లేదు.

    పాజిటివ్ టాక్ వచ్చినా కూడా..

    పాజిటివ్ టాక్ వచ్చినా కూడా..

    బాహుబలి అనంతరం కూడా రానా విభిన్నమైన కథలను ఎంచుకుంటు హైప్ అయితే బాగానే క్రియేట్ చేస్తున్నాడు. రానా చేసే ప్రమోషన్ వల్ల కూడా సినిమా బిజినెస్ పెరుగుతూ వస్తోంది. అయితే అరణ్య సినిమాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ కాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు ఏమి రావడం లేదు.

    నాన్ థియేట్రికల్ గా..

    నాన్ థియేట్రికల్ గా..

    సంతోషించాల్సిన విషయం ఏమిటంటే సినిమాకు నాన్ థియేట్రికల్ గా ముందే కొంత డబ్బు వచ్చింది. సినిమా కోసం 60కోట్లు ఖర్చు చేశారు. నాన్ థియేట్రికల్ గానే 45కోట్లు వెనక్కి రావడంతో నిర్మాత నష్టాల నుంచి బయటపడ్డారని అనిపిస్తోంది. అన్ని భాషల్లో డిజిటల్, ఓటీటీ డీల్స్ ద్వారా మంచి ఎమౌంట్ దక్కింది.

    4వ రోజు వచ్చిన షేర్

    4వ రోజు వచ్చిన షేర్

    ఇక నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం 8లక్షలు, సీడెడ్ 4లక్షలు, ఉత్తరాంధ్ర 5లక్షలు, ఈస్ట్ 3లక్షలు, వెస్ట్ 2లక్షలు, గుంటూరు 3లక్షలు, కృష్ణ 3.1లక్షలు, నెల్లూరు 1లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో 4రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 0.29కోట్లు. గ్రాస్ 0.52కోట్లు.

    అసలైన టార్గెట్ ఎంతంటే..

    అసలైన టార్గెట్ ఎంతంటే..

    అరణ్య మూవీ 15కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.5కోట్లు. ఫస్ట్ డే 1.38కోట్ల షేర్ రాగా వరల్డ్ వైడ్ గా సెకండ్ డే 67లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ముడవరోజు నాలుగవ రోజు కలెక్షన్స్ దారుణంగా తగ్గాయి. 4 రోజుల్లో మొత్తం వచ్చిన షేర్ 4.53కోట్లు.

    నష్టపోకుండా ఉండాలి అంటే

    నష్టపోకుండా ఉండాలి అంటే

    ఈ భారీ బడ్జెట్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టిన పెట్టుబడి సగంలో సగం వెనక్కి వచ్చేసింది. ఈ సినిమా థియేట్రికల్ గా నష్టపోకుండా ఉండాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 10.97కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. గురువారం వరకు కొంత ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ తరువాత నాగార్జున వైల్డ్ డాగ్, కార్తీ సుల్తాన్ రిలీజ్ కానున్నాయి. మరి ఈ గ్యాప్ లో రానా సినిమా ఎంతవరకు లాక్కోస్తుందో చూడాలి.

    English summary
    Rana Daggubati is one of the actors who attracts the audience mostly with different movies. No matter what role he plays, he is promoted to create a special hype on the film. It is known that the audience is coming forward with the Aranya shooting on the 26th of this month. However in a recent interview Rana reveale
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X