twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aranya Day 5 Collections: రానా మూవీపై కరోనా దెబ్బ.. బాక్సాఫీస్ వద్ద విలవిల

    |

    స్టార్ హీరో రానా దగ్గుబాటి నటించిన అరణ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని కూడగట్టుకొన్నది. భావోద్వేగమైన కథ, రానా విలక్షణ నటన ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో విఫలం కావడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేస్తున్నది. గత 5 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా మధ్య వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు, వేణు శ్రీరాం

    విమర్శకుల ప్రశంసలు అందుకొన్న అరణ్య

    విమర్శకుల ప్రశంసలు అందుకొన్న అరణ్య

    అటవీ సంపద, జంతువుల సంరక్షణ నేపథ్యంగా దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన అరణ్య చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా సగటు ప్రేక్షకుడిని మెప్పించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న కారణంగా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విఫలమైందనే వాదన ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమైంది.

    నాభి‌ ప్రదర్శనతో శ్రద్దా దాస్ అందాల ఆరబోత.. క్రేజీ ఫోటోషూట్ వైరల్...

    5వ రోజున కలెక్షన్లు

    5వ రోజున కలెక్షన్లు

    అయితే 5వ రోజున అరణ్య చిత్రం నైజాంలో 3 లక్షలు, సీడెడ్‌లో 2 లక్షలు, ఉత్తరాంధ్రలో 2 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.60 లక్షలు, గుంటూరు రూ.1 లక్ష, కృష్ణా జిల్లాలో రూ.1లక్ష, నెల్లూరులో 20 వేలు వసూలు చేసింది. దాంతో ఏపీ, నైజాంలో రూ.11 లక్షల నికర కలెక్షన్లు, రూ.23 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

    దిశాపటానీ బోల్డ్ ఫోటోలు.. ముంబై ఎయిర్‌పోర్టులో స్మార్ట్‌గా

    మొత్తం 5 రోజుల వసూళ్లు

    మొత్తం 5 రోజుల వసూళ్లు

    గత 5 రోజుల్లో అరణ్య చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే తొలి రోజున రూ.1.38 కలెక్షన్లు, రెండో రోజున రూ.67 లక్షలు, మూడో రోజున రూ.55 లక్షలు, నాలుగో రోజున రూ.29 లక్షలు, ఐదో రోజున రూ.11 లక్షల కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో చిత్రం రూ.3 కోట్ల నికరం, రూ.4.82 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1.48 కోట్లు, ఓవర్సీసీస్‌లో రూ.21 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.4.69 కోట్లు నికరంగా, రూ.8.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    లంగా ఓణిలో పాయల్ రాధాకృష్ణ.. యువ తార లవ్లీ ఫోటోషూట్...

    భారీ నష్టాల దిశగా....

    భారీ నష్టాల దిశగా....

    అరణ్య చిత్రం సుమారు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే పలు భాషల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఈ చిత్రం రూ.45 కోట్లు రాబట్టింది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్ స్వయంగా రిలీజ్ చేసింది. అయితే తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.15 కోట్లకుపైగానే రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ చిత్రం 5 కోట్ల మేర వసూళ్లు సాధించడం బట్టి చూస్తే.. భారీ నష్టాల్లో ముగిసే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Aranya Day 5 Collections: As per Trade Report Rana Daggubati's Aranya movie Own Release in All Centers. Movie was Made With Whopping 60Cr Budget and 35cr~ Recovered from Non Theatrical Rights... now Movie Need another 15Cr~ from Theatrical Run. This movie collected Rs.8.70 crores gross world wide
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X