Animal Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద యానిమల్ మొదటి రోజే రూ.100కోట్లు... యూస్ఏలో రికార్డు కలెక్షన్స్
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా అర్జున్ రెడ్డి తర్వాత... అంత కంటే 100 రెట్లు వైయిలెంట్ మూవీగా తెరకెక్కించిన చిత్రమే యానిమల్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ విదేశాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. తొలిరోజు అంచనా కలెక్షన్లు, యూఎస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇండియాలో ది మోస్ట్ ఎవైటెట్ మూవీ యానిమల్. సందీప్ వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లు తెరకెక్కింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వి రాజ్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఇప్పటికే యూఎస్ లో ప్రిమియర్ షోలు పడ్డాయి. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇండియాలోనూ ప్రిమియర్ షోలు పడగా.. ఇక్కడ కూడా మంచి టాక్ లభిస్తుంది. ఇక ఈ చిత్రానికి సందీప్ రెడ్డి మార్క్ డైరెక్షన్ తో తెరకెక్కింది. ఈ సినిమాను టి సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. రణబీర్ వైల్డ్ యాక్టింగ్ కు నెటిజన్స్, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. మరి, సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి? సినిమాకు ఓపెనింగ్స్ ఎంత రావచ్చు? అని ఒకసారి చూస్తే... రణబీర్ కపూర్ కెరీర్ చూస్తే... 'సంజు', 'బ్రహ్మాస్త్ర' వంటి భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. అయితే అవి మాస్ చిత్రాలు కావు. కంటెంట్ బేస్డ్ క్లాస్ ఫిలిమ్స్. యానిమల్ కు వస్తే అవుట్ అండ్ అవుట్ సందీప్ రెడ్డి వంగా స్టైల్ కమర్షియల్ ఫిల్మ్ గా తెరకెక్కింది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో సినిమాలో మాస్ కంటెంట్ ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. అందుకు తగ్గట్లు బుకింగ్స్ బాగా జరిగాయి. అయితే ఈ సినిమా ఏకంగా 1 మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసేసి బాలీవుడ్ చిత్రాల్లో ఒక ఫాస్టెస్ట్ 1 మిలియన్ గ్రాసర్ గా నార్త్ అమెరికాలో నిలిచింది. మరి దీనిని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ కూడా అధికారికంగా ప్రకటించింది. రణబీర్ కపూర్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అన్ని భాషల్లో కలిపి.. ఇండియాలో 60 కోట్లు వసూలు చేయనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ లోనూ భారీగానే వసూలూ చేయనుందని అంటున్నారు. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 100 కోట్లు రూపాయలు వసూలు చేస్తుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది రణబీర్ కపూర్ కెరియర్ లో బెస్ట్ ఒపెనింగ్స్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











