Animal Day 5 Collections: యానిమల్ సంచలన వసూళ్లు...దిల్ రాజుపై కాసుల వర్షం..ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబోలో రూపొందిన వచ్చిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు మ్యూజిక్ అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద లాభాలతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా 5 రోజుల బాక్సాఫీస్ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

యానిమల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే... మొదటి రోజు రూ.15.40 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.12.45 కోట్ల గ్రాస్, 3వ రోజు రూ.12.20 కోట్ల గ్రాస్, 4వ రోజు రూ. 4.80 కోట్ల గ్రాస్, 5వ రోజు రూ.4.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఐదురోజుల్లో యానిమల్ మూవీ రూ.49.10 కోట్ల గ్రాస్ (రూ.25.10 కోట్ల షేర్) వసూలు చేసింది.

Ranbir Kapoor Rashmika Tripti Dimri Animal Movie 5 Days Worldwide Box Office Collections

ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీకి భారీగా హైప్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ మూవీ రూ.14 కోట్ల వ్యాపారం నమోదు చేసుకోగా... బ్రేక్ ఈవెన్ రూ.15 కోట్లతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా రూ.10.10 కోట్ల లాభంతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు భారీ ధరకు విక్రయించగా.. ఇక ఈ సినిమాకు లాభాలు వస్తున్నాయి.

Ranbir Kapoor Rashmika Tripti Dimri Animal Movie 5 Days Worldwide Box Office Collections

యానిమల్ సినిమా 5 రోజుల హిందీ కలెక్షన్స్ చూస్తే... మొదటి రోజు రూ.54.75 కోట్ల నెట్ (శుక్రవారం), 2వ రోజు రూ.58.37 కోట్ల నెట్ (శనివారం), 3వ రోజు రూ.63.43 కోట్ల నెట్ (ఆదివారం), 4వ రోజు రూ. 40.06 కోట్ల నెట్ (ఆదివారం), 5వ రోజు రూ.34.02 కోట్ల నెట్ (ఆదివారం) రాబట్టింది. ఇక ఐదు రోజుల్లో హిందీలో ఈ సినిమా రూ.250.63 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.

యానిమల్ 5 రోజుల మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్‌లు చూస్తే... తెలుగు రాష్ట్రాలు రూ.49.10 కోట్లు, తమిళనాడు రూ.5.75 కోట్లు, కర్ణాటక రూ.20.95 కోట్లు, కేరళ రూ.1.70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.259.25 కోట్లు, ఓవర్సీస్ రూ.143.35 కోట్లు వసూలు చేయగా.. మొత్తం వరల్డ్ వైడ్ గా రూ.480.10 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Ranbir Kapoor Rashmika Tripti Dimri Animal Movie 5 Days Worldwide Box Office Collections

మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.115.60 కోట్ల గ్రాస్, 2వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.119.25 కోట్ల గ్రాస్, 3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.120.80 కోట్ల గ్రాస్, 4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.68.60 కోట్ల గ్రాస్, 5వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.55.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్‌ను చేసుకుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 250 కోట్లు బిజినెస్ చేసుకుంది. అంటే రూ. 252 కోట్లు నెట్ వస్తేనే ఇది హిట్ అవుతుంది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లో దూసుకుపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X