Brahmastra day 5 collections దారుణంగా పడిపోయిన కలెక్షన్లు.. ఎంత మేరకు నష్టమంటే?
బ్రహ్మస్త్ర చిత్రం వారాంతం తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కాకపోతే వారాంతం తర్వాత మంగళవారం వసూళ్లను పరిశీలిస్తే... గత చిత్రాల కంటె మెరుగ్గానే కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సోమవారం కలెక్షన్లతో పోల్చుకొంటే 15 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఆదివారం కలెక్షన్లతో పోల్చుకొంటే దాదాపు 70 శాతానికి పైగా కలెక్షన్లు క్షీణించాయి. అయితే ఈ చిత్రం 150 కోట్ల క్లబ్‌లో చేరడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఊరటగా మారింది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

15 శాతం కంటే తక్కువగా
బ్రహ్మస్త్ర చిత్రం ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో వర్కింగ్ డే రోజున కేవలం 15 శాతానికి మించి అక్యుపెన్సీ కనిపించలేదు. ఇక తెలుగు, తమిళంలో ఈ సినిమా 2డీ, 3డీ వెర్షన్ల అక్యుపెన్సీ కూడా యావరేజ్‌గా 15 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. దాంతో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

గత నాలుగు రోజుల్లో
బ్రహ్మస్త్ర చిత్రం గత నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లు 140 కోట్లు రాబట్టింది. తొలి రోజున 36.5, రెండో రోజున 42.5, మూడో రోజున 45.5 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజున 32 కోట్ల మేరకు వసూళ్లు సాధించింది. ఇక ఐదో రోజున ఈ చిత్రం మరో 15 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియావైడ్‌గా 150 కోట్లు రాబట్టింది.

5వ రోజున హిందీలో
బ్రహ్మస్త్ర చిత్రం 5వ రోజున హిందీలో 11.90 కోట్లు, తెలుగు, తమిళం కలిపి 1.10 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 15.30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గత ఐదు రోజుల్లో ఈ సినిమా సాధించిన అత్యల్ప కలెక్షన్లు ఇవే అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. దక్షిణాదిలో ఈ చిత్రం ఇప్పటి వరకు 18 కోట్లు రాబట్టడం గమనార్హం.

5 రోజుల ఓవర్సీస్ కలెక్షన్లు
ఇక బ్రహ్మస్త్ర ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 3.8 మిలియన్ డాలర్లు, రెండో రోజున 3.1 మిలియన్ డాలర్లు, మూడో రోజున 2.8 మిలియన్ డాలర్లు, నాలుగో రోజున 700k, ఐదో రోజున 300k డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా రోజుల్లో 11.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే దాదాపు 84 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 251 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బ్రహ్మస్త్ర లాభాల్లోకి రావాలంటే?
బ్రహ్మస్త్ర చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కనీసం 300 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియా 150 కోట్లు, ఓవర్సీస్‌లో 84 కోట్లు రాబట్టింది. దాంతో 234 కోట్లు నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా ఈ చిత్రం 66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











