Shamshera Collections: మొదటి రోజే రణ్‌బీర్‌కు ఎదురుదెబ్బ.. బాలీవుడ్‌లో మరో డిజాస్టర్!
కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమాల పరిస్థితి చాలా విభిన్నంగా మారిపోతుంది. అసలు వీక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు అనే విషయం సినీ తారలకు అంతుచిక్కడం లేదు. ఒక విధంగా మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను అయితే ఎంత పెద్ద స్టార్ నటించిన కూడా చూడడం లేదు అని క్లారిటీ అయితే ఉంది. ఇక నటనకు ప్రాధాన్యత ఎంత ఉన్నా కూడా కథలో మాత్రం బలమైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు తిప్పికొట్టేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే గత కొంతకాలంగా వరుస అపజయాలు కొనసాగుతున్న విషయాన్ని తెలిసిందే.
ఇక రీసెంట్ గా వచ్చిన రణబీర్ కపూర్ నటించిన షంషేరా సినిమా అయినా కనీసం సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఒక విధంగా ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా రణబీర్ కపూర్ నెలల తరబడి ఈ సినిమా కోసం ప్రమోషన్స్ గట్టిగానే చేశాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టారు.

అయితే ఈ సినిమా మొదటి రోజు కనీసం 20 కోట్లు అయినా అందుకుంటుంది అనుకుంటే ఊహించిన విధంగా 8 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. షంషేరా సినిమాపై రణబీర్ కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే తర్వాత రాబోయే సినిమాలకు ఈ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యం. మేయిన్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని రణబీర్ కపూర్ నమ్మకంతో ఉన్నాడు. ఆ సినిమా తెలుగులో కూడా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే షంషేరా సినిమా సక్సెస్ తో బ్రహ్మాస్త్ర పై హైప్ పెంచాలని అనుకున్నారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. షంషేరా సినిమా మొదటి రోజు కనీసం 10 కోట్లు కూడా రాబట్టకపోవడంతో ఇప్పుడు మళ్లీ సినిమా వ్యాపారాలపై సందేహాలు మొదలవుతున్నాయి. మరి రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రం కోసం ఎలాంటి ప్రమోషన్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











