Animal 10 Days Collections: యానిమల్‌కు నమ్మలేని వసూళ్లు.. అప్పుడే 700 కోట్లు.. తొలి మూవీగా రికార్డు
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి ఎన్నో భారీ పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచీ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. అలాంటి వాటిలో వైల్డ్ కంటెంట్‌తో వచ్చిన 'యానిమల్' ఒకటి. తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తూనే ఉంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సండే ఇది సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'యానిమల్' మూవీకి 10 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి!
యానిమల్‌గా వచ్చిన హీరో
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కలిసి చేసిన చిత్రమే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

యానిమల్ మూవీ బిజినెస్
క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.
10వ రోజు ఎంత వచ్చింది?
'యానిమల్' మూవీకి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. దీంతో తొలి రోజు రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు వచ్చాయి. ఇక, పదో రోజు ఈ సినిమా రూ. 37 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో
క్రేజీ కాంబోలో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 10 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 22 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 183 కోట్లు రాబట్టింది.
పది రోజులకు కలిపి ఇలా
రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి పది రోజుల్లోనూ భారీ స్థాయిలోనే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దిమ్మతిరిగిపోయే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ పది రోజుల్లో రూ. 432.27 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 710 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.
టార్గెట్ ఇలా.. లాభం అలా
డిఫరెంట్ యాక్షన్‌తో తెరకెక్కిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల్లోనే ఈ సినిమా రూ. 432 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 222 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

తొలి సినిమాగా రికార్డుతో
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీకి 10వ రోజైన రెండో ఆదివారం ఏకంగా రూ. 37 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. తద్వారా పదో రోజు ఇంత మొత్తం వసూలు చేసిన ఏకైక హిందీ చిత్రంగా ఇది సరికొత్త చరిత్రను సృష్టించింది. అలాగే, వేగంగా రూ. 700 కోట్లు గ్రాస్ రాబట్టిన హిందీ చిత్రాల జాబితాలోనూ ఇది చేరిపోయింది.


Click it and Unblock the Notifications











