Animal 12 Days Collections: కుమ్ముతున్న యానిమల్.. 12 రోజుల్లో వందల కోట్లు.. దిల్ రాజుకు లాభం ఎంతంటే!

సాధారణంగా ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అలాంటి వాటిలో క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' ఒకటి. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రేక్షకుల నుంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.

ఫలితంగా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఈ వీక్‌ డేస్‌లో మాత్రం ఇది కాస్త డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'యానిమల్' మూవీకి 12 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి మరి!

Ranbir Kapoor Starrer Animal Movie 12 Days Worldwide Box Office Collections

యానిమల్‌గా దండయాత్ర: రణ్‌బీర్ కపూర్ నటించిన యాక్షన్ సినిమానే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

Ranbir Kapoor Starrer Animal Movie 12 Days Worldwide Box Office Collections

యానిమల్ మూవీ బిజినెస్: పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందించారు.

Ranbir Kapoor Starrer Animal Movie 12 Days Worldwide Box Office Collections

12వ రోజు ఎంత వచ్చింది?: 'యానిమల్' మూవీకి భారీ స్పందన వస్తోంది. దీంతో తొలి రోజు రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 13.85 కోట్లు, 12వ రోజు రూ. 13 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.

Ranbir Kapoor Starrer Animal Movie 12 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: అదిరిపోయే యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 12 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 25.2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 210 కోట్లు రాబట్టింది.

Ranbir Kapoor Starrer Animal Movie 12 Days Worldwide Box Office Collections

12 రోజులకు కలిపి ఇలా: రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి 12 రోజుల్లోనూ భారీ స్థాయిలోనే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దిమ్మతిరిగిపోయే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ పది రోజుల్లో రూ. 458.12 కోట్లు నెట్‌ వసూళ్లతో పాటు రూ. 756 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: క్రేజీ యాక్షన్‌తో తెరకెక్కిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 12 రోజుల్లోనే ఈ సినిమా రూ. 458 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 248 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

తెలుగులో అన్ని కోట్లతో: తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా దిల్ రాజు భారీగా రిలీజ్ చేశారు. ఇక్కడ రూ. 15 కోట్లు టార్గెట్‌లో వచ్చిన ఈ చిత్రం 12 రోజుల్లోనే రూ. 33.80 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. ఫలితంగా రూ. 18.80 కోట్లు లాభాలను ఇది సొంతం చేసుకుని రణ్‌బీర్ బెస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X