Animal 13 Days Collections: బాహుబలి రికార్డు బ్రేక్.. 13 రోజుల్లోనే వందల కోట్లు.. లాభమే అన్ని కోట్లా
బాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరించడంతో పాటు స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు రణ్‌బీర్ కపూర్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇటీవలే 'యానిమల్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అయితే, ఇప్పుడు మాత్రం క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'యానిమల్' మూవీకి 13 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే లుక్కేయండి!
యానిమల్‌గా రణ్‌బీర్ రాక : రణ్‌బీర్ కపూర్ హీరోగా చేసిన సినిమానే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు.

యానిమల్ మూవీ బిజినెస్ : వైల్డ్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
13వ రోజు ఎంత వచ్చింది : 'యానిమల్' మూవీకి తొలి రోజు రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 13.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 13 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 25.6 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 213 కోట్లు రాబట్టింది.
13 రోజులకు కలిపి ఇలా : బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి 13 రోజుల్లోనూ భారీ స్థాయిలోనే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దిమ్మతిరిగిపోయే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 13 రోజుల్లో రూ. 467.54 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 774 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా : అదిరిపోయే యాక్షన్‌తో తెరకెక్కిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 13 రోజుల్లోనే ఈ సినిమా రూ. 467 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 257 కోట్లు లాభాలను కూడా అందుకుంది.
బాహుబలి రికార్డు బద్దలు : టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఫలితంగా ఇండియాలో ఎక్కువ గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో 'యానిమల్' చేరిపోయింది. ఈ క్రమంలోనే రూ. 448.50 కోట్లతో 'బాహుబలి 1' పేరిట ఉన్న రూ. 418 కోట్లు రికార్డును ఇది బద్దలు కొట్టేసింది.


Click it and Unblock the Notifications











