Animal 15 Days Collections: యానిమల్ మరో సంచలన రికార్డు.. ఇండియాలో ఫస్ట్ మూవీ.. అప్పుడే అన్ని కోట్లా!

బాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా పేక్షకులను ఫిదా చేయడంతో పాటు తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. ఈ ఉత్సాహంతోనే వరుసగా మూవీలను చేస్తూ వెళ్తున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా రణ్‌బీర్ 'యానిమల్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. ఈ చిత్రానికి మొదటి నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి 15 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి మరి!

Ranbir Kapoor Starrer Animal Movie 15 Days Worldwide Box Office Collections

యానిమల్‌‌గా వచ్చిన స్టార్: రణ్‌బీర్ కపూర్ నటించిన యాక్షన్ మూవీనే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలను పోషించారు.

Ranbir Kapoor Starrer Animal Movie 15 Days Worldwide Box Office Collections

యానిమల్ మూవీ బిజినెస్: అదిరిపోయే యాక్షన్‌తో తెరకెక్కిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Ranbir Kapoor Starrer Animal Movie 15 Days Worldwide Box Office Collections

15వ రోజు ఎంత వచ్చింది?: 'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 15.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు, 15వ రోజు రూ. 7.50 నెట్ వచ్చింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: భారీ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 15 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 26.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 216 కోట్లు కలెక్ట్ చేసింది.

Ranbir Kapoor Starrer Animal Movie 15 Days Worldwide Box Office Collections

15 రోజులకు కలిపి ఇలా: సందీప్ - రణ్‌బీర్ కపూర్ కలిసి చేసిన 'యానిమల్' మూవీకి 15 రోజుల్లోనూ అదిరే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మైండ్ బ్లాక్ అయ్యే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 15 రోజుల్లో రూ. 484.34 కోట్లు నెట్‌ వసూళ్లతో పాటు రూ. 796 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

Ranbir Kapoor Starrer Animal Movie 15 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం అలా: క్రేజీ యాక్షన్‌తో తెరకెక్కిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 రోజుల్లోనే ఈ సినిమా రూ. 484 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 274 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

Ranbir Kapoor Starrer Animal Movie 15 Days Worldwide Box Office Collections

ఆస్ట్రేలియాలో సంచలనం: టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇది భారీ స్పందనతో చరిత్ర సృష్టించింది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం 4.75 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఫలితంగా అక్కడ టాప్‌లో పఠాన్ మూవీ రికార్డును (4.72 మిలియన్ డాలర్లు) బ్రేక్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X