Animal 16 Days Collections: యానిమల్ మాస్ కుమ్ముడు.. అప్పుడే 8000000000 వసూళ్లు.. దిల్ రాజు జాక్‌పాట్
ఇండియా వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే విశేషమైన హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి కోవలోకి వచ్చే సినిమానే 'యానిమల్'.
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం భారీ వసూళ్లతో సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ 'యానిమల్' మూవీకి 16 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి!

యానిమల్‌గా విశ్వరూపం: రణ్‌బీర్ కపూర్ నటించిన యాక్షన్ మూవీనే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

యానిమల్ మూవీ బిజినెస్: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

16వ రోజు ఎంత వచ్చింది?: 'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 16.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు, 15వ రోజు రూ. 8.30 కోట్లు, 16వ రోజు రూ. 12.84 కోట్లు నెట్ వచ్చింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: ఊరమాస్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 16 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 26.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 220 కోట్లు వసూలు చేసింది.

16 రోజులకు కలిపి ఇలా: సందీప్ - రణ్‌బీర్ కపూర్ కాంబోలో వచ్చిన 'యానిమల్' మూవీకి 16 రోజుల్లోనూ అదిరే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని విధంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 16 రోజుల్లో రూ. 498.28 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 818 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: యాక్షన్ ఎమోషనల్ స్టోరీతో వచ్చిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 16 రోజుల్లోనే ఈ సినిమా రూ. 498 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 288 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

800 కోట్లు.. తెలుగులోనూ: తెలుగు పరిశ్రమకు చెందిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అప్పుడే రూ. 800 కోట్లు గ్రాస్‌ను రాబట్టి సంచలన రికార్డును సొంతం చేసుకుంది. ఇక, తెలుగులో కూడా భారీగానే రాణిస్తోన్న ఈ మూవీ.. ఇప్పటికే దిల్ రాజుకు రూ. 20 కోట్లకు పైగా లాభాలను కూడా అందించింది.


Click it and Unblock the Notifications











