Animal 17 Days Collections: యానిమల్ మరో సంచలనం.. ఇండియాలోనే తొలి చిత్రంగా.. కోట్ల లాభాలతో రికార్డు
గతంలో కంటే ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా వచ్చే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అలా వచ్చి సెన్సేషన్ అయిన చిత్రాల్లో 'యానిమల్' ఒకటి. టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదట్లోనే మంచి టాక్ లభించింది.
ఫలితంగా ఈ మూవీకి ఆరంభం నుంచీ ఆడియెన్స్ రెస్పాన్స్ భారీగానే లభిస్తోంది. దీంతో ఈ చిత్రం మూడో వారంలో కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ 'యానిమల్' మూవీకి 17 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి మరి!

యానిమల్ మాస్ అరాచకం: రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన చిత్రమే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలను పోషించారు.

యానిమల్ మూవీ బిజినెస్: భారీ అంచనాలను ఏర్పరచుకుని వచ్చిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

17వ రోజు ఎంత వచ్చింది?: 'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 17.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు, 15వ రోజు రూ. 8.30 కోట్లు, 16వ రోజు రూ. 12.84 కోట్లు, 17వ రోజు రూ. 15 కోట్లు నెట్ వచ్చింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: అదిరిపోయే యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 17 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 27 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 224 కోట్లు రాబట్టింది.

17 రోజులకు కలిపి ఇలా: సందీప్ - రణ్‌బీర్ కపూర్ కలిసి చేసిన 'యానిమల్' మూవీకి 17 రోజుల్లోనూ అదిరే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని విధంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 17 రోజుల్లో రూ. 512.94 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 843 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: యాక్షన్ ఎమోషనల్ స్టోరీతో వచ్చిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 17 రోజుల్లోనే ఈ సినిమా రూ. 512 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 302 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

ఎన్నో రికార్డులు బద్దలు: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అప్పుడే రూ. 500 కోట్లు నెట్‌ను రాబట్టి సంచలన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే, కెనెడాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగానూ రికార్డు నెలకొల్పింది. వీటితో పాటు రూ. 300 కోట్లు లాభాలతో ఈ చిత్రం సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











