Animal 19 Days Collections: మరో మార్క్ దాటిన యానిమల్.. ఆ సినిమాల బడ్జెట్ అంత లాభాలతో రికార్డు
మిగిలిన జోనర్లతో పోల్చుకుంటే యాక్షన్ మూవీలు ఇప్పుడు ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటివే పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్నాయి. ఇప్పుడు అలా వచ్చిన క్రేజీ మూవీనే 'యానిమల్'. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఇది అదిరిపోయే వసూళ్లను రాబడుతూ సత్తా చాటింది. అలా మూడో వారంలోనూ ఇది దుమ్ముదులుపుతోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ 'యానిమల్' మూవీకి 19 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి!
రణ్‌బీక్ యానిమల్‌గా రాక:రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

యానిమల్ మూవీ బిజినెస్:ఎన్నో అంచనాలతో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో విడుదల చేసుకున్నారు.
19వ రోజు ఎంత వచ్చింది?:'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 19.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు, 15వ రోజు రూ. 8.30 కోట్లు, 16వ రోజు రూ. 12.84 కోట్లు, 17వ రోజు రూ. 14.50 కోట్లు, 18వ రోజు రూ. 5.50 కోట్లు, 19వ రోజు రూ. 5 కోట్లు నెట్ వచ్చింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో:ఫాదర్ అండ్ సన్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 19 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 27.6 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 229 కోట్లు రాబట్టింది.

19 రోజులకు కలిపి ఇలా:సందీప్ - రణ్‌బీర్ కపూర్ కాంబోలో వచ్చిన 'యానిమల్' మూవీకి 19 రోజుల్లోనూ అదిరే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని విధంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 19 రోజుల్లో రూ. 522.94 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 850 కోట్లు గ్రాస్ మార్క్‌ను దాటి సత్తా చాటింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 రోజుల్లోనే ఈ సినిమా రూ. 522 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 312 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











