Animal 1st Week Collections: వారంలో వందల కోట్లు.. ఇండియాలో మూడో సినిమాగా.. తెలుగు డైరెక్టర్ సంచలనం
గతంలో కంటే ఇప్పుడు తెలుగు దర్శకులు దేశ వ్యాప్తంగా సత్తా చాటుతోన్నారు. ఫలితంగా వేరే భాషల హీరోలతో సైతం సినిమాలు చేస్తున్నారు. అలాంటి డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకడు. 'కబీర్ సింగ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి వెళ్లిన అతడు.. ఇటీవలే రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' అనే సినిమాను తెరకెక్కించాడు.
వైల్డ్ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. దీంతో దీనికి వసూళ్లు అదిరిపోయేలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'యానిమల్' మూవీకి వారం రోజుల్లో వచ్చిన వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!

వైల్డ్ యాక్షన్‌తో యానిమల్: రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రమే 'యానిమల్'. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు.

యానిమల్ మూవీ బిజినెస్: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేసుకున్నారు.

ఏడో రోజు ఎంత వచ్చింది?: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. దీంతో మొదటి రోజు రూ. 63.80 కోట్లు, రెండో రోజు రూ. 66.27, మూడో రోజు రూ. 71.46 కోట్లు, నాలుగో రోజు రూ. 43.96 కోట్లు, ఐదో రోజు రూ. 37.47 కోట్లు, ఆరో రోజు రూ. 30.39 కోట్లు వచ్చాయి. ఇక, ఏడో రోజు ఈ చిత్రం రూ. 25.50 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.
ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 7 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 19.1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 159 కోట్లు రాబట్టింది.
వారం రోజులకు కలిపితే: రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి వారం రోజుల్లోనూ అదిరిపోయే రీతిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలోనే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ ఏడు రోజుల్లో రూ. 338.85 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 558 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: క్రేజీ కాంబోలో రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 7 రోజుల్లోనే ఈ సినిమా రూ. 338 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 128 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

మూడో స్థానంలోకి చేరింది: రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీకి వారంలోనే రూ. 558 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఫలితంగా వారంలో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రాల జాబితాలో ఇది మూడో స్థానానికి చేరుకుంది. ఈ లిస్టులో 'జవాన్' మూవీ రూ. 661 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 'పఠాన్' రూ. 630 కోట్లతో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











