Animal 2 Days Collections: యానిమల్ ఊచకోత.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు ఔట్.. బాహుబలి రికార్డు ఫినీష్
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా మన దర్శకులు బాలీవుడ్‌లో సైతం ప్రభావాన్ని చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకడు. 'కబీర్ సింగ్'తో సత్తా చాటిన ఆయన.. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' అనే సినిమాను రూపొందించాడు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే విడుదలైన ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'యానిమల్' మూవీకి 2 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూసేయండి మరి!
క్రేజీ యాక్షన్‌తో యానిమల్
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన మూవీనే 'యానిమల్'. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు దీన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు.

యానిమల్ మూవీ బిజినెస్
బాలీవుడ్ రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు భారీగానే డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
రెండో రోజు మరింత ఎక్కువ
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం మొదటి రోజు ఓవరాల్‌గా రూ. 63.8 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. రెండో రోజు దీనికంటే ఎక్కువ రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఈ సినిమాకు రూ. 68 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో
'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే, రణ్‌బీర్ కపూర్‌కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఈ చిత్రాన్ని అంతటా ఎంతో మంచి స్పందనే లభిస్తోంది. ఇక రెండు రోజులు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 5.8 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 48 కోట్లు రాబట్టింది.
రెండు రోజులకు కలిపితే
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'యానిమల్' మూవీకి రెండు రోజుల్లో భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ రెండో రోజుల్లో రూ. 129.80 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 250 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 129 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 81 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.

బాహుబలి రికార్డు బ్రేక్ చేసి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ రెండు రోజుల్లోనే ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా హిందీలో వేగంగా (2 రోజుల్లోనే) రూ. 100 నెట్ సాధించి 'పఠాన్', 'జవాన్', 'కేజీఎఫ్ 2' చిత్రాల సరసన చోటు దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'బాహుబలి 2', 'గదర్ 2', 'సంజు' చిత్రాలను దాటింది.


Click it and Unblock the Notifications











