Animal 2 Weeks Collections: 210 కోట్లు రావాలి.. 2 వారాల్లోనే వందల కోట్లు.. తెలుగులో సరికొత్త చరిత్ర
గతంలో కంటే ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా హై రేంజ్ యాక్షన్ మూవీలు వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే హైప్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' ఒకటి. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం వసూళ్లను భారీ స్థాయిలో రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి 14 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి!
యానిమల్‌గా మారిన హీరో : బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించిన సినిమానే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

యానిమల్ మూవీ బిజినెస్ : క్రేజీ యాక్షన్‌తో తెరకెక్కిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.
14వ రోజు ఎంత వచ్చింది : 'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 14.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు నెట్ వచ్చింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో : హై రేంజ్ కాంబోలో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా 14 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 25.9 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 215 కోట్లు రాబట్టింది.
14 రోజులకు కలిపి ఇలా : సందీప్ - రణ్‌బీర్ కపూర్ కలిసి చేసిన 'యానిమల్' మూవీకి 14 రోజుల్లోనూ భారీ స్థాయిలోనే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దిమ్మతిరిగిపోయే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 14 రోజుల్లో రూ. 476.84 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 786 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా : భారీ అంచనాలతో వచ్చిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 14 రోజుల్లోనే ఈ సినిమా రూ. 476 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 266 కోట్లు లాభాలను కూడా అందుకుంది.
తెలుగులోనూ సంచలనం : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. దీంతో రెండు వారాల్లోనే 786 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా ఏకంగా రూ. 20 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది. తద్వారా ఎక్కువ లాభాలు అందుకున్న బాలీవుడ్ మూవీగానూ ఇది నిలిచింది.


Click it and Unblock the Notifications











