Animal 20 Days Collections: యానిమల్ ఊతకొట్టుడు.. 20 రోజుల్లో వందల కోట్లు.. దిల్ రాజుకు కోట్ల లాభాలు
ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా భాషల్లో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే హైప్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి. అలాంటి సినిమానే 'యానిమల్'. టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ హీరోతో కలిసి చేసిన ఈ సినిమాకు ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది.
అందుకు తగ్గట్లుగానే దీనికి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా మూడో వారంలోనూ ఇది డీసెంట్ నెంబర్లను రాబడుతోంది. మరి 'యానిమల్' మూవీకి 20 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి మరి!

యానిమల్‌గా బాలీవుడ్ స్టార్: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ నటించిన తాజా చిత్రమే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు.

యానిమల్ మూవీ బిజినెస్: భారీ హైప్‌తో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే ఊహించని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

20వ రోజు ఎంత వచ్చింది?: 'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 20.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు, 15వ రోజు రూ. 8.30 కోట్లు, 16వ రోజు రూ. 12.84 కోట్లు, 17వ రోజు రూ. 14.50 కోట్లు, 18వ రోజు రూ. 5.75 కోట్లు, 19వ రోజు రూ. 5.50 కోట్లు, 20వ రోజు రూ. 5 కోట్లు నెట్ వచ్చింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: ఎమోషనల్ అండ్ యాక్షన్ స్టోరీతో రూపొందిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 20 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 27.6 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 229 కోట్లు కలెక్ట్ చేసింది.

20 రోజులకు కలిపి ఇలా: సందీప్ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీకి 20 రోజుల్లోనూ అదిరే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 20 రోజుల్లో రూ. 528.69 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ రూ. 859 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 20 రోజుల్లోనే ఈ సినిమా రూ. 528 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 318 కోట్లు లాభాలు సాధించింది. తెలుగులో దిల్ రాజుకు రూ. 21 కోట్లు వరకూ ప్రాఫిట్స్ తెచ్చింది.


Click it and Unblock the Notifications











