Animal 3 Days Collections: యానిమల్ పెను సంచలనం.. 3 రోజుల్లోనే వందల కోట్లు.. ఇండియాలో ఫస్ట్ మూవీగా!

ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అయిన పాన్ ఇండియా చిత్రాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అందులో మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 'యానిమల్' ఒకటి.

అంతలా ఇది భారీ హైప్ క్రియేట్ చేసుకుని గత వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి డీసెంట్ టాక్ రావడంతో ఆడియెన్స్ రెస్పాన్స్ భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీకి 3 రోజుల్లో వచ్చిన వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!

Ranbir Kapoor Starrer Animal Movie 3 Days Worldwide Box Office Collections

యానిమల్‌గా రణ్‌బీర్ రాక:రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రమే 'యానిమల్'. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలను చేశారు.

Ranbir Kapoor Starrer Animal Movie 3 Days Worldwide Box Office Collections

యానిమల్ మూవీ బిజినెస్: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేసుకున్నారు.

Ranbir Kapoor Starrer Animal Movie 3 Days Worldwide Box Office Collections

మూడో రోజు మరింతగానే: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. దీంతో మొదటి రోజు రూ. 63.80 కోట్లు, రెండో రోజు రూ. 66.27 కోట్లు నెట్‌ వసూళ్లను ఇది రాబట్టింది. మూడో రోజు మరింత ఎక్కువ స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం ఏకంగా రూ. 72.50 కోట్లు నెట్‌తో పాటు రూ. 115 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో: రణ్‌బీర్ కపూర్‌ నటించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో అదిరిపోయే స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ స్పందనతో క్రేజీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇలా మూడు రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 9.6 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 79.9 కోట్లు రాబట్టింది.

Ranbir Kapoor Starrer Animal Movie 3 Days Worldwide Box Office Collections

మూడు రోజులకు కలిపితే: యాక్షన్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'యానిమల్' మూవీకి మూడు రోజుల్లో భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ మూడో రోజుల్లో రూ. 202.57 కోట్లు నెట్‌ వసూళ్లతో పాటు రూ. 345 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

Ranbir Kapoor Starrer Animal Movie 3 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో రూపొందిన 'యానిమల్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 202 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 8 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తే హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Ranbir Kapoor Starrer Animal Movie 3 Days Worldwide Box Office Collections

ఇండియాలోనే ఫస్ట్ మూవీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీ మూడు రోజుల్లోనే ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఇలా ఇది ఏకంగా రూ. 200 కోట్లు నెట్‌తో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫలితంగా ఇండియాలోనే వేగంగా రూ. 200 కోట్లు నెట్ మార్కును చేరిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే జవాన్, పఠాన్ 4 రోజుల రికార్డును బ్రేక్ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X