Animal 3 Weeks Collections: 210 కోట్లు రావాలి.. 3 వారాల్లో మతిపోగొట్టే వసూళ్లు.. తెలుగులోనూ రికార్డు
గతంలో కంటే ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా పాన్ ఇండియా స్థాయిలో బహు భాషా సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'యానిమల్' ఒకటి. క్రేజీ కాంబోలో రూపొందిన ఈ సినిమాకు మొదట్లోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన అదిరిపోయేలా వచ్చింది. అందుకు తగ్గట్లుగానే వసూళ్లను బాగా రాబట్టింది. మరి 'యానిమల్' మూవీకి 21 రోజుల్లో వచ్చిన వసూళ్లను మీరే చూడండి మరి!
యానిమల్‌గా రణ్‌బీర్ రాక : స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా మూవీనే 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా తీసిన దీన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు.

యానిమల్ మూవీ బిజినెస్ : క్రేజీ కాంబోలో రూపొందిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే ఊహించని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 210 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 4000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
21వ రోజు ఎంత వచ్చింది : 'యానిమల్'కు ఫస్ట్ డే రూ. 63.80 కోట్లు, 2వ రోజు రూ. 66.27, 3వ రోజు రూ. 71.46 కోట్లు, 4వ రోజు రూ. 43.96 కోట్లు, 5వ రోజు రూ. 37.47 కోట్లు, 6వ రోజు రూ. 30.39 కోట్లు, 7వ రోజు రూ. 24.23 కోట్లు, 8వ రోజు రూ. 22.95 కోట్లు, 9వ రోజు రూ. 34.74 కోట్లు, 10వ రోజు 36 కోట్లు, 11వ రోజు రూ. 21.85 కోట్లు, 12వ రోజు రూ. 12.72 కోట్లు, 13వ రోజు రూ. 10.25 కోట్లు, 14వ రోజు రూ. 8.75 కోట్లు, 15వ రోజు రూ. 8.30 కోట్లు, 16వ రోజు రూ. 12.84 కోట్లు, 17వ రోజు రూ. 14.50 కోట్లు, 18వ రోజు రూ. 5.75 కోట్లు, 19వ రోజు రూ. 5.50 కోట్లు, 20వ రోజు రూ. 5.15 కోట్లు, 21వ రోజు రూ. 2.50 కోట్లు నెట్ వచ్చింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో : యాక్షన్‌కు ఎమోషన్‌ను జోడించి తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే రాణిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా 21 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 27.7 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 230 కోట్లు కలెక్ట్ చేసింది.
21 రోజులకు కలిపి ఇలా : రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన 'యానిమల్' మూవీకి 21 రోజుల్లోనూ అదిరే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'యానిమల్' మూవీ 21 రోజుల్లో రూ. 531.34 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ రూ. 864 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం అలా : 'యానిమల్' మూవీకి రూ. 210 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా విడుదలైంది. 21 రోజుల్లోనే ఈ సినిమా రూ. 531 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 321 కోట్లు లాభాలు సాధించింది. తెలుగులో దిల్ రాజుకు రూ. 22 కోట్లు వరకూ ప్రాఫిట్స్ తెచ్చింది.


Click it and Unblock the Notifications











